గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నయీమ్ అక్రమంగా ఆక్రమించుకున్న భూముల డాక్యుమెంట్లను బాధితులకు తిరిగిచ్చేయాలని సిట్, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.