వివరాల్లోకి వెళితే ఐశ్వర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి. అశోక్ కుమార్ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇంకా తల్లిదండ్రులు కఠినమైన షరతులు పెట్టారు. అంతేకాదు, పెళ్లికి కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఎవరూ రావొద్దని షరతు పెట్టారు. ఇందుకు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. వీరి పెళ్లి నవంబర్ 23వ తేదీన ఫిక్స్ అయింది.