వ్యవసాయ బావి వద్దకు పిల్లలు, భర్తతో కలిసి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భర్తను తుపాకీతో కాల్చి.. పిల్లల ముందే కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ధోల్ పూర్ కు చెందిన ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరికి ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించారు.
మొదటగా ఆమె భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత భార్యపై పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
కొంతసమయం తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితులు బాధిత మహిళ గ్రామానికి చెందినవారేనని గుర్తించారు.