వివరాల్లోకి వెళితే.. శనివారం పూట ఓ మహిళను బజారు వద్ద ఓ యువకుడు అడ్డగించి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అతడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె అతడిని హెచ్చరించింది. దీంతో అక్కడ నుంచి అవమానభారంతో వెనుదిరిగిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆపై స్నేహితులను వెంటబెట్టుకుని.. ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఆమెపై దాడి చేశాడు.
వివస్త్రను చేసి వీధుల్లో పరుగులు పెట్టించాడు. భయంతో రోడ్లపై పరుగులు పెడుతున్న ఆమెను రక్షించాల్సిన స్థానికులు ఫొటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.