వికలాంగురాలిపై అత్యాచారయత్నం.. శ్మశానవాటిక దగ్గరకు తీసుకెళ్లి..?

ఆదివారం, 30 డిశెంబరు 2018 (12:22 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన పదమూడేళ్ల బాలిక మానసిక వికలాంగురాలు. ఆమెపై అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కన్నేశాడు. 
 
శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్థానిక శ్మశాన వాటికి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కడంతో పాటు దాడి చేసి, శరీరంపై విచక్షణారహితంగా గాయపరిచాడు. 
 
ఆమె అరుపులు, కేకలు విన్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని రాజును పట్టుకుని దేహాశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. వికలాంగురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు