బీహార్‌‌లో పోటీ పరీక్షలు-స్లీవ్ లెస్ డ్రస్సులు వేసుకోలేదని కత్తిరించేశారు..

సోమవారం, 14 మే 2018 (09:35 IST)
బీహార్‌లో పోటీ పరీక్షలు రాసే అమ్మాయిలకు అవమానం జరిగింది. పోటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన అమ్మాయిల దుస్తులను కత్తెరలు బ్లేడులతో కత్తిరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లాలో శనివారం నాడు నర్సింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ టెస్టును బీహార్ కంబైన్డ్ ఎంట్రెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీసీఈసీఈబీ) నిర్వహించింది. ఈ పరీక్షలకు అమ్మాయిలు చేతులను పూర్తిగా కప్పి వుండే దుస్తులు హాజరయ్యారు. 
 
స్లీవ్ లెస్ డ్రస్సులు మాత్రమే ధరించి పరీక్షకు వెళ్లాలి. ఈ విషయంలో సరైన అవగాహన లేని చాలామంది అమ్మాయిలు చేతులు కప్పివున్న దుస్తులతో వెళ్లడంతో అధికారులు అమ్మాయిల దుస్తులను కట్ చేశారు. 
 
ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో విద్యాశాఖ విచారణకు ఆదేశించి, భవిష్యత్తులో ఆ సెంటర్‌లో ఏ విధమైన పరీక్షలు జరిపించకుండా నిషేధాన్ని విధించింది. ఈ పరీక్షకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన అధికారిని జీవితకాలం పాటు మరోసారి పరీక్షలకు ఇన్‌చార్జ్‌గా వేయకుండా నిషేధించినట్టు జిల్లా విద్యాధికారి లలన్ ప్రసాద్ సింగ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు