వీకెండ్ వచ్చిందంటే చాలు... యూత్ బార్‌ల వైపు బారులు తీస్తున్నారు. ఇంకేముంది పబ్‌లో.. మందేసి చిందేయడం... అర్థరాత్రి డ్రంక్ & డ్రైవ్ తనిఖీలో దొరకడం.. పోలీసులకు చుక్కలు చూపించడం... మామూలైపోయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయగా... తప్పతాగిన మైకంలో కార్లు నడుపుతూ ఇద్దరు యువతులు పోలీసులకు చిక్కారు.
మద్యం తాగిన మత్తులో ఉన్న ఆ ఇద్దరు యువతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మహిళా కానిస్టేబుల్ లేకుంటే సహకరించేది లేదని నీషు అగర్వాల్ అనే యువతి మొండికేసింది. చివరికి మహిళా కానిస్టేబుల్‌ని రప్పించి తనిఖీ చేసారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా.. మద్యం మోతాదు 86 పాయింట్లుగా నమోదైంది. దీంతో నీషు అగర్వాల్ పైన కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు.
తాగిన మత్తులో కారు నడుపుతూ చిక్కిన మరో యువతి విద్యార్థిని లహరికు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షంచగా.. 47 పాయింట్ల మద్యం మోతాదుగా నమోదైంది. దాంతో లహరి పైన కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లో 96 కేసులు చేసి 39 కార్లు, 57 బైకుల్ని సీజ్ చేసారు. డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన వారందర్నీ బేగంపేట్‌లో కౌన్సిలింగ్ నిర్వహించాక.. కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు మీడియాకి తెలియచేసారు.