బెంగళూరులో మహిళలు.. ఆ విషయంలో బాగా ముదుర్లట..?

సోమవారం, 6 మే 2019 (18:15 IST)
బెంగళూరు.. అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారిపోయింది. అంతేకాదు.. ఆసియాలోనే విద్యుత్ సౌకర్యం పొందిన తొలి నగరంగా గుర్తింపు పొందిన బెంగళూరు.. ప్రస్తుతం వివాహేతర సంబంధాల్లోనూ ముందుంది. బెంగళూరులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివాసం వుంటున్నారు. విదేశీయులు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. అయితే బెంగళూరులో ఇటీవల పాశ్చాత్య సంస్కృతి బాగా అలముకుంది. 
 
తాజాగా బెంగళూరు వాసులు వివాహేతర సంబంధాల విషయంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో వున్నారట. బెంగళూరు తర్వాతి స్థానాల్లో ముంబై, కోల్‌కతా, న్యూఢిల్లీ, పుణేలు ఉన్నాయని తాజాగా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
ఈ క్రమంలో గ్లీడాన్ అనే వెబ్‌సైట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం బెంగళూరుకు చెందిన 1.35 లక్షల మంది వివాహేతర సంబంధాల కోసం ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. వీరిలో 43200 మంది మహిళలే వుండటం గమనార్హం.  
 
తమ యాక్టివ్ యూజర్లలో 27 శాతం మంది బెంగళూరు వాసులేనని గ్లీడాన్ తెలిపింది. వీరిలో 32 శాతం పురుషులు ఉండగా.. 68 శాతం మహిళలు ఉన్నారు. కుటుంబంతో కలిసి ఉంటూనే వేరే వ్యక్తులతో డేటింగ్ చేయాలనుకునే వారికి ఉపయోగపడేలా.. పెళ్లయిన వారికోసం ప్రత్యేకంగా గ్లీడాన్ డేటింగ్ సైట్‌ను రూపొందించారు. దీన్ని మహిళలే నిర్వహిస్తున్నారు. 
 
ఈ సైట్ ద్వారా పెళ్లయిన వారు సేఫ్‌గా తమతో డేటింగ్ చేసేవారిని వెతుక్కోవచ్చునని ఆప్షన్ వుంది. దీని ప్రకారం మహిళలు భద్రతతో కూడిన వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు