ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే ఎన్నికల్లో పోటీ : మెహబూబా ముఫ్తీ

శనివారం, 26 జూన్ 2021 (16:35 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే అధికరణాలు 370, 35ఏని పునరుద్ధరించే వరకు తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తేల్చి చెప్పారు. 
 
కాశ్మీర్ రాష్ట్రానికి తిరిగి ప్రత్యేక ప్రతిపత్తితో పాటు.. రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ అఖిలక్ష నేతలతో ఢిల్లీలో సమావేసం నిర్వహించిచన విషయం తెల్సిందే. 
 
ఈ సమావేశంలో ముఫ్తీ మాట్లాడుతూ, 370,35ఏని ఆర్టికల్‌లను పునరుద్ధరించేవరకు అధికార రాజకీయాల్లో భాగం కాబోమని స్పష్టం చేశారు. పైగా, ఆ రెండింటినీ కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోదని తనకు తెలుసని, కానీ, ఎప్పుడో ఒకప్పుడు అది జరిగి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. 
 
ఇందుకోసం తాము పోరాటం చేస్తామన్నారు. అనుకున్నది సాధించే వరకు గుప్కర్ కూటమి కలిసికట్టుగా ఉద్యమిస్తుందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కునే తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 370ని రద్దు చేసి రాజ్యాంగాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు