ఇజ్రాయిల్ రాయబారి భార్యే లక్ష్యంగా దాడి : హోం మంత్రి
మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (16:01 IST)
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన కారు బాంబు దాడి ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం మంగళవారం స్పందించారు. ఈ చర్యను ఉగ్రవాదుల దాడిగా అభివర్ణించారు. బాంబు దాడిలో అయస్కాంత సంబంధిత పదార్ధాలు వినియోగించినట్లు తెలిపారు. అయితే సోమవారం ఇజ్రాయిల్ దౌత్య సిబ్బందికి చెందిన కారులో జరిగిన ఈ దాడిలో భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి భార్య లక్ష్యంగా చేసుకుని జరిగిందన్నారు.
అలాగే, దీనిపై అనంతరం ఢిల్లీ పోలీస్ కమిషనర్ బికే గుప్తా, ఇతర అధికారులు మాట్లాడుతూ.. ఈ సంఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులు పూర్తి శిక్షణ పొందిన తర్వాతే పాల్గొని ఉండవచ్చని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇన్నోవా కారును వెంబడించిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ వద్ద ఆపి ఉన్న కారు కుడివైపున ఏదో తెలియని ప్యాకెట్‌ను ఉంచారని తెలిపారు.