అమరావతి :ఈ నెల 30వ తేదీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాధిపతి డా.కోడెల శివప్రసాదరావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు.
ఈమేరకు ఆయన కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగ సందర్భంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భక్తులు చేసిన ప్రార్థనలు లోక కళ్యాణానికి, సుఖశాంతులకు ఆలవాలం అవుతాయని ఆయన పేర్కొన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సిరిసంపదలు కలగాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని దుర్గామాతను వేడుకుంటున్నట్టు స్వీకర్ పేర్కొన్నారు.