శ్రీరాముడు అనుష్టించిన నవరాత్రి వ్రతం.. ఫలితం ఏమిటంటే? (video)

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (05:00 IST)
నవరాత్రులు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకే నవరాత్రులకు ముందు వచ్చే శుక్రవారం శ్రీ లక్ష్మీ పూజ చేసుకోవాలని.. నవరాత్రుల్లో ముగ్గురమ్మలను పూజించేందుకు సిద్ధం కావాలని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. నవరాత్రి అంటేనే బొమ్మల కొలువు గుర్తుకు వస్తుంది. నవరాత్రుల సందర్భంగా ఆచరించే వ్రతం ద్వారా అనుకున్నది సిద్ధిస్తుంది. 
 
పూర్వం సీతాదేవి రావణుడిచేత అపహరణకు గురైనప్పుడు.. నారద మహర్షి శ్రీరాముడిని కలిసి.. ఆయన అవతార లక్ష్యాన్ని గుర్తు చేస్తారు. ఇంకా రావణాసుర వధ జరగాలని, అదే రామావతార లక్ష్యమని పేర్కొంటారు. రావణాసుర వధ జరగాలంటే.. భగవతీ దేవి అనుగ్రహం కోసం నవరాత్రి వ్రతం ఆచరించాలని పేర్కొంటారు. అలా రావణాసురుడిని వధించడం కోసం రామావతార లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు నవరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అది నెరవేరినట్లు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నారదుని ఉపదేశం మేరకు శ్రద్ధతో నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు.. శ్రీరాముడు. 
 
అలా నవరాత్రి వ్రతమాచరించిన శ్రీరామునికి అష్టమి రోజున అంబికా మాత సింహ వాహన ధారిగా అనుగ్రహించింది. అలాగే శ్రీరాముడి అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ అవతారాలను గుర్తు చేశారు. ఇంకా దేవతా అంశలైన వానరులు రామునికి సాయం చేస్తారని వరమిచ్చింది. 
Rama
 
ఇంకా ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు.. ఇంద్రజిత్తు వధిస్తాడని.. రావణాసురుడు నీ చేత హతమవుతాడని దుర్గామాత శ్రీరామునికి చెప్తుంది. అలా నవరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆది దంపతుల అనుగ్రహం రామునికి లభించింది. ఈ వ్రతాన్ని దేవతలు, దానవులు, సప్త రుషులు అనుష్టించారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాంటి మహిమాన్వితమైన వ్రతాన్ని మానవులు అనుసరిస్తే.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వారు సెలవిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు