విజయ దశమి... దసరా పండుగను నవరాత్రులుగా జరుపుకోడం తెలిసిందే. ఈ నవరాత్రుల సమయంలో వ్రతం ఆచరించేవారు పెద్దవుల్లిపాయ, వెల్లుల్లిని తినడం మానేస్తారు. ఆహార పదార్థాల్లో ఈ రెండు లేకుండా చూసుకుని తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనే దాని వెనుక సైంటిఫిక్ కారణాలు వున్నాయి.
ఉల్లిపాయ, వెల్లుల్లి ప్రత్యేకమైనవి. ఇవి శరీర శక్తిని ప్రేరేపిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల నవరాత్రి ఉపవాస సమయంలో ఈ కారణంగా ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం వుంది. అందువల్ల వీటిని తీసుకోరు.