చేమదుంపలు-మటన్ కూర... ఆహా ఏమి రుచి అనాల్సిందే...

బుధవారం, 17 ఏప్రియల్ 2019 (21:11 IST)
మటన్ కూరను మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడతారు. అయితే మటన్‌ను ఎప్పుడు వండుకునే పద్దతిలో కాకుండా చేమదుంపలతో కలిపి చేసుకుంటే ఆహా ఏమి రుచి అనావల్సిందే. మరి ఈ వెరైటీ మటన్ చేమదుంపల కూరలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 
 
కావలసిన పదార్దాలు :
మటన్-  కిలో,
చేమదుంపలు - అరకిలో,
ఉల్లిపాయలు - మూడు
అల్లంవెల్లుల్లి - రెండు టేబుల్ స్పూన్లు,
యాలకులు - పది, 
లవంగాలు - ఏడు,
పలావు ఆకులు - మూడు, 
కారం - రెండు టేబుల్ స్పూన్లు,
పసుపు - అర టీ స్పూన్, 
మిరియాలు - టీ స్పూన్,
ధనియలు పొడి - రెండు టేబుల్ స్పూన్లు,
పెరుగు - కప్పు,
నూనె - కప్పు,
కొత్తిమీర - చిన్న కట్ట, 
 
తయారుచేయు విధానం :
ముందుగా చేమదుంపలు వుడికించి పొట్టు తీసి పక్కన వుంచాలి. స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి మసాల దినుసులు వేసి వేపాలి, వేగాక ఉల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత శుభ్రం చేసిన మటన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. 
 
పది నిముషాలు వుంచితే మటన్ లోని నీరు మొత్తం యిగిరి పోతుంది. ఇప్పుడు ధనియాల పొడి, పెరుగు వేసి ఒకసారి కలిపి, మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. ఐదు నిముషాలు ఉడికిన తరువాత ఉడికించి, పొట్టు తీసిన చేమదుంపలు వేసి కలిపి, ఒక నిముషం ఉడకనిచ్చి కొత్తిమీర జల్లి స్టవ్ ఆపాలి. అంతే... ఎంతోరుచిగా వుండే మటన్ చేమదుంపలు కూర రెడి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు