నాన్ వెజ్ ప్రియులు చికెన్‌ని అమితంగా ఇష్టపడతారు. అయితే చికెన్‌ని రొటీన్‌గా కాకుండా వెరైటీగా వండితే చాలా ఇష్టంగా తింటారు. వంకాయతో చికెన్.. ఏంటీ అనుకుంటున్నారా.... దీని రుచి చాలా బాగుంటుంది. వంకాయలో చికెన్ కీమా స్టఫ్ చేసి వండుకుని తింటే ఆ రుచే వేరు. మరి వంకాయతో చికెన్ కీమా ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిర్చి- మూడు(తరిగినవి),
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను,
టమోటాలు - రెండు,
గరం మసాలా - ఒక టీస్పూను,
కారం - ఒక టీస్పూను
తయారుచేయు విధానం
వంకాయల్ని కాడ తీయకుండా... నిలువుగా మధ్యలోకి కోయాలి. స్పూన్‌తో లోపలి గుజ్జును తీసేయాలి. లోపల కాస్త ఉప్పు చల్లితే నీరు పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి తగినంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి వేసి అవి వేగాక అల్లంవెల్లుల్లి వేసి రెండు నిముషాలు వెయించాలి. తరువాత చికెన్ కీమా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులో టమోటా ప్యూరీని వేసి వేయించాలి. తరువాత మిరియాల పొడి, కాస్త చక్కెర, ఉప్పు వేసి కలపి మూతపెట్టి బాగా ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయచ్చు. నీరంతా చిక్కబడే దాకా కీమాని వేయించాలి.