దోసకాయ రొయ్యల కూర ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 25 మే 2019 (12:46 IST)
దోసకాయలో నీటి శాతం ఎక్కువగా వుంది. దోసకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వేసవిలో డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి దోసకాయతో.. క్యాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా వుండే సీ ఫుడ్ రొయ్యలతో దోసకాయ రొయ్యల గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
దోసకాయ తరుగు - రెండు కప్పులు 
రొయ్యలు - పావు కేజీ 
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు 
కారం - రెండు స్పూన్లు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు రెండు, లవంగాలు రెండు, సోంపు అరస్పూన్ వేసి.. వేగాక రొయ్యల్ని వేసి వేపుకోవాలి. ఎర్రగ వేగిన తర్వాత దోసకాయ ముక్కలు చేర్చాలి. అర స్పూన్ పసుపు పొడి చేర్చాలి. ఇందులో ఉల్లి తరుగు చేర్చి.. ఈ మిశ్రమం బాగా మిక్స్ అయ్యాక కారం, ఉప్పు, నీరు తగినంత చేర్చి.. రొయ్యల్ని బాగా వేయించాలి. 
 
రొయ్యలు బాగా ఉడికాక.. గ్రేవీ వరకు వచ్చేలా స్టౌ మీద వుంచి దించేయాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే దోసకాయ రొయ్యల గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే బాగుంటుంది. ఈ గ్రేవీని రోటీలకు, దోసెలకు కూడా సైడిష్‌గా వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు