ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు. ఉల్లిపాయను రోజూ మన ఆహారంతో కలిసి తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయట. ఉల్లిపాయ క్యాన్సర్‌ను నివారించడంలో ముందుంటుంది. ఇది అందాన్ని పెంచుతుంది. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు శృంగారంలో బాగా బలహీనులవుతున్నారు. శారీరకంగాను, మానసికంగా ఉన్న కొన్ని సమస్యల వల్ల వాళ్ళ బాగస్వామ్యిని సంతృప్తి పెట్టలేకపోతున్నారు.
అలాంటి వారు రోజువారీ ఆహారంతో ఉల్లిపాయను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటుందన్నారు ఆయుర్వేద నిపుణులు. శృంగారం చేయకున్నా, శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్న వారు ఒక ఉల్లిపాయను వెన్నెలో బాగా వేయించుకుని రోజూ తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ శరీరంలో వేడి పెరుగుతూనే ఉంటుంది.
దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేడి అధికంగా ఉన్నప్పుడు గంజిలో రోజూ ఒక ఉల్లిపాయను నంచుకోని తింటే వేడి వెంటనే తగ్గిపోతుందట. వెంట్రుకలు బాగా ఊడిపోతున్నట్లయితే ఒక ఉల్లిపాయ రసాన్ని తీసి వెంట్రుకల కుదుళ్ళకు బాగా పట్టేలాగా అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి. చుండ్రును కూడా నియంత్రిస్తుందట.