చికెన్ రైస్..?

బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:55 IST)
కావలసిన పదార్థాలు:
అన్నం - ఒకటిన్నర కప్పు 
ఉడికించిన చికెన్ - ముప్పావుకప్పు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - 2 రెబ్బలు
పొడుగ్గా తరిగిన క్యారెట్ - అరకప్పు
ఉడికించిన పచ్చిబఠాణీ - పావుకప్పు
వెన్న - స్పూన్
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
నూనె - స్పూన్
ఉప్పు - తగినంత
మిరియాలపొడి - స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తరువాత క్యారెట్ తరుగు, ఉడికించిన పచ్చిబఠాణీ వేసి వేయించాలి. క్యారెట్ పచ్చివాసన పోయాక చికెన్ ముక్కలు తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూరలా తయారయ్యాక అన్నం, వెన్నా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి 5 నిమిషాలయ్యాక దింపేయాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ రైస్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు