కొరమీను చేపలను వెన్నతో ఫ్రై చేసి టేస్ట్ చేశారా?

సోమవారం, 23 డిశెంబరు 2019 (12:29 IST)
కొరమీను చేపలతో చేపల కూర చేసి వుంటాం. అయితే కొరమీనును వెన్నతో ఫ్రై చేస్తే ఎలా వుంటుందో తెలుసా.. అయితే ఇలా చేయండి.  
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - అరకేజీ 
వెన్న - 50 గ్రాములు 
నూనె - వేపుడు తగినంత 
మిరియాల పొడి - ఒక చెంచా 
ఉప్పు - తగినంత 
నిమ్మకాయ - ఒకటి 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
శుభ్రం చేసిన కొరమీనులో ఒకే ఒక ముల్లు వుంటుంది. కోసి ఆ ముల్లును తీసేయాలి. ఆ చేపను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ చేప ముక్కలను అందులో వేసి దోరగా వేపుకోవాలి. దింపే ముందు కొత్తిమీర- వెన్న వేసి దించేయండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు