సండే స్పెషల్- మొఘలుల రిసిపీ.. మటన్ నిహారీ టేస్ట్ చేశారా?

శనివారం, 12 ఆగస్టు 2023 (15:12 IST)
Mutton Nihari
మొఘలుల రాజ వంటశాలల్లో తయారయ్యే మటన్ నిహారీ రిసిపీ గురించి తెలుసుకుందాం. ఈ మటన్ నిహారి వంటకం వండడానికి 3-4 గంటలు పడుతుంది. కానీ ఈ నిహారీ మసాలాతో మటన్ రుచి చూస్తే తప్పకుండా ఆ టేస్టును వదిలిపెట్టరు. 
 
ఈ నిహారీ మటన్ రెసిపీ అనేది ఒక సాంప్రదాయ పాకిస్తానీ వంటకం. ఈ వంటకం భారతదేశం- పాకిస్తాన్ ప్రజలకు బాగా పరిచయం. నిహారీని పాకిస్తాన్ జాతీయ వంటకంగా పరిగణిస్తారు. అలాంటి నిహారీ మటన్‌ను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 
 
కావలసిన పదార్థాలు : మటన్ - 500 గ్రాములు, ఉల్లిపాయలు - ఒకటిన్నర కప్పు, గోధుమ పిండి - 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు - నాలుగు, ధనియాలు -1 టేబుల్ స్పూన్, మిరియాలు - 1 టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు - 6, నల్ల యాలకులు - 2 పచ్చ ఏలకులు - 6, అనాసి పువ్వులు - 1, చిన్న లవంగాలు - 6, జీలకర్ర - 1 టీస్పూన్, దాల్చిన చెక్క బెరడు - 2 టీస్పూన్లు, జాజికాయ - 3 రెమ్మలు, నల్ల జీలకర్ర - అర స్పూన్, సోంపు - 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం పొడి - 1 టేబుల్ స్పూన్, నూనె, ఉప్పు- తగినంత,  నెయ్యి - పావు కప్పు.
 
తయారీ విధానం: 
నిహారీ మసాలాకు బిర్యానీ ఆకులు, ధనియాలు, మిరియాలు, ఎండు మిరపకాయలు, యాలకులు, పైనాపిల్ పువ్వు, ఆవాలు, లవంగాలు, జీలకర్ర, బెరడు, జాతి పత్రి, నల్ల జీలక, సోంపులను మీడియం మంటలో వేయించాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి 1 కిలో మటన్ కోసం తీసుకోవాల్సిన మసాలా పరిమాణం.
 
మటన్‌ను బాగా కడిగి అందులో ధనియాలపొడి, పసుపు, 2 టీస్పూన్ల కాశ్మీరీ కారం, కావాల్సినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 'నిహారీ' మసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంటపాటు మూతపెట్టి ఉంచాలి.
 
గంట తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో కప్పు నూనె వేసి వేడి చేయాలి. దానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయ బంగారు రంగులోకి మారినప్పుడు, అందులో నానబెట్టిన మటన్ కర్రీ మిశ్రమాన్ని వేసి, కూర బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. కాసేపయ్యాక నూనె విడిపోయి పైకి వస్తుంది. తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి కూర ఉడకనివ్వాలి. రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ తెరవాలి. ఉడకబెట్టిన మిశ్రమంలో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. ఒక గిన్నెలో గోధుమ పిండిని ముద్దలు లేకుండా నీటితో కరిగించండి. 
 
దీనిని కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం కొద్దిగా చిక్కగా తయారయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి. మరో కడాయిలో నెయ్యి పోసి అది వేడయ్యాక మిగిలిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. 
 
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో అర టీస్పూన్ కాశ్మీరీ కారం, అర టీస్పూన్ 'నిహారీ మసాలా' వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ఉడికిస్తే.. రుచికరమైన 'మటన్ నిహారీ' రెడీ. ఈ మిశ్రమాన్ని  వేడి అన్నంతో, రోటీలకు, చపాతీలకు సైడిష్‌గా టేస్ట్ చేస్తే రుచి అదిరిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు