రోగనిరోధక శక్తిని పెంచే ముల్లంగి సబ్జీని ఎలా చేయాలి..?

శుక్రవారం, 14 జులై 2023 (12:07 IST)
Radish Sabji
ముల్లంగిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముల్లంగి చాలా మేలు చేస్తుంది. 
అలాంటి ముల్లంగితో సబ్జీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
ముల్లంగి (సన్నగా తరిగినవి) - రెండు కప్పులు 
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి) - 2 
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్లు 
ఇంగువ పొడి- పావు స్పూన్ 
నూనె - కావలసినంత 
ఉప్పు- కావలసినంత
 
రెసిపీ:
బాణలిలో నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇంగువ పొడి వేసి వేయించాలి. తర్వాత తరిగిన ముల్లంగిని వేసి బాగా వేయించాలి. ఆపై ఉప్పు అవసరమైన జోడించాలి. ముల్లంగిలో నీరు ఇంకే వరకు వేయించాలి.  ముల్లంగి పూర్తిగా ఉడికిన తర్వాత, పొయ్యి నుండి తీసివేయండి. అంతే సూపర్ ముల్లంగి సబ్జీ రెడీ. ఈ సబ్జీని చపాతీలకు వడ్డిస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు