పుదీనా చికెన్‌ తయారీ విధానం....

సోమవారం, 25 జూన్ 2018 (16:05 IST)
పుదీనా ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తుంది. పుదీనా వేసవితాపంతో వేడెక్కిన శరీరంలో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది. ఇలాంటి పుదీనాతో చికెన్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
చికెన్‌ - 400 గ్రాములు
పుదీనా - 2 కప్పులు 
కొత్తిమీర తరుగు - 1/2 కప్పు 
అల్లం - చిన్నముక్క 
వెల్లుల్లి - 6 
పచ్చిమిర్చి- 1 
పెరుగు - 2 స్పూన్స్ 
గరంమసాలా - 1 స్పూన్ 
పసుపు - 1/2 స్పూన్ 
ఉప్పు - తగినంత 
నూనె - సరిపడా
నిమ్మకాయ - 1
 
తయారీ విధానం:
ముందుగా పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుని అందులో పసుపు, గరంమసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు పట్టించి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాగిన తరువాత ఆ చికెన్ ముక్కలను వేసి రెండువైపులా సమానంగా వేగనివ్వలి. ఈ వేపిన చికెన్ ముక్కలను ప్లేట్లో తీసుకుని వాటిపై తరిగిన కొత్తిమీర వేసి, నిమ్మరసం పిండుకుంటే పుదీనా చికెన్ రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు