బ్రెడ్‌ జిలేబి తయారీ విధానం...

శుక్రవారం, 22 జూన్ 2018 (14:33 IST)
బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండడం వలన సహజంగా దీనిని ఆహారంలో చేర్చుకుంటుంటారు. అటువంటి బ్రెడ్‌తో జిలేబీలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బ్రెడ్‌ ముక్కలు - 4 
పంచదార - అర కప్పు 
మంచినీళ్లు - అర కప్పు 
యాలకుల పొడి - పావు టీస్పూన్ ‌ 
ఫుడ్‌ కలర్ ‌- చిటికెడు 
నూనె-తగినంత
 
తయారుచేసే విధానం:
బ్రెడ్‌ ముక్కలను కుకీ కట్టర్‌తో గుండ్రని బిస్కెట్‌ ఆకారంలో కట్‌ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పంచదార వేసి అందులో మంచినీళ్ళు పోసి దాన్ని స్టవ్‌పై పెట్టాలి. పంచదార కరిగేవరకు గరిటెతో తిప్పుతూ 5 నిమిషాలపాటు మరగనివ్వాలి. తరువాత పంచదార పాకాన్ని కిందికి దించి చల్లారాక అందులో ఫుడ్‌ కలర్‌, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
స్టౌపై బాణలి ఉంచి తగినంత నూనెను పోసి వేడయ్యాక అందులో గుండ్రంగా కట్‌ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్‌ ముక్కలను వేసి సన్నటి మంటపై దోరగా వేగించాలి. వేగిన బ్రెడ్‌ ముక్కలను పంచదార పాకంలో వేసి, 5 నిమిషాల తరువాత తీసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేయాలి. అంతే బ్రెడ్ జిలేబి రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు