ఆస్ట్రేలియన్ పౌరుడికి 15 ఏళ్ల జైలుశిక్ష

FILE
ఒక చైనా విద్యార్థిని భారతీయ విద్యార్థిగా భావించి హత్య చేసిన జాన్ కరటొజోలో అనే ఆస్ట్రేలియన్ పౌరుడికి విక్టోరియన్ సుప్రీంకోర్టు 15 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. కాగా... భిన్న సంస్కృతులకు నిలయమైన ఆస్ట్రేలియాలో జాతి వివక్ష దాడులకు తావులేదని కేసును విచారించిన న్యాయమూర్తి డేవిడ్ హార్పర్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే... జాన్ కరటొజోలో కేవలం సెల్‌ఫోన్ కోసం గత సంవత్సరం జనవరి నెలలో మెల్‌బోర్న్‌ నగరంలో జాంగ్‌జున్ కెవో అనే 41 సంవత్సరాల చైనా పరిశోధక విద్యార్థిపై తన మిత్రులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కేవో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

భారతీయుల వద్ద ఖరీదైన ఫోన్లు ఉంటాయని, కెవో కూడా భారతీయుడేనని భావించిన కరటొజోలో ఈ దాడికి పాల్పడ్డాడు. కేవోపై దాడి తరువాత కరటొజోలో తన మిత్రులతో కలిసి మరో భారతీయ విద్యార్థిపై కూడా దాడి చేసేందుకు వెళ్లాడు. తమ విద్యార్థిని దారుణంగా పొట్టనబెట్టుకున్న కరటొజోలోకు ఆ శిక్ష సరిపోదని మరింత కఠినంగా శిక్షించాలని ఆస్ట్రేలియాలోని చైనీయులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి