బ్లాక్‌బస్టర్ YRF స్పై యూనివర్స్ నుంచి రానున్న వార్ 2 గురించి ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామాని యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్‌గా నిర్మించిందది. ఈ వార్ 2 చిత్రం మరో ముప్పై రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ఈ హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 14న తెరపైకి గ్రాండ్‌గా రానుంది.