ప్రవాస భారతీయుల్లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన సెప్టువగెనేరియన్ పల్లోన్‌జీ మిస్ట్రీ.. ఐర్లండ్ దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరిగా నిలిచారు. 3.9 బిలియన్ పౌండ్ల సంవత్సరాదాయం కలిగిన వ్యాపారవేత్తగా మిస్ట్రీ ఈ ఘనతను సాధించారు.
2003వ సంవత్సరంలో ఐర్లండ్ పౌరుడుగా పౌరసత్వం అందుకున్న మిస్ట్రీ, ఐర్లండ్ జాతీయురాలైన ఓ మహిళను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడి పోయారు. రియల్ ఎస్టేట్, కార్ల తయారీ, హెవీ ఇండస్ట్రీ, టీ అండ్ పార్టీ.. తదితర రంగాలలో వ్యాపారవేత్తగా మిస్ట్రీ పేరుగాంచారు.
ఐర్లండ్‌లో తాజ్ మహల్ హోటల్‌ను కూడా నిర్వహిస్తున్న మిస్ట్రీ.. భారత ప్రైవేటు సంస్థ అయిన టాటా సన్స్‌లో 18.4 శాతం నిధులను పెట్టుబడి పెట్టారు.