నర్సుల నొసటన సింధూరం: దక్షిణాఫ్రికా ఓకే

మంగళవారం, 2 సెప్టెంబరు 2008 (12:45 IST)
భారతీయ సాంప్రదాయ చిహ్నాలపై దేశవిదేశాల్లో నిషేధం విధించినా... మన మహిళ మాత్రం తన హక్కు కోసం పోరాడి విజయాలు సాధిస్తూనే ఉంది. నుదుటన సింధూరం పెట్టుకోకూడదని దక్షిణాఫ్రికాలో ఇటీవల నిషేధం విధించారు.

భారతీయ మహిళలు సాంప్రదాయ చిహ్నాలు ధరించరాదని స్థానిక అడింగ్టన్ హాస్పిటల్ తమ నర్సులపై విధించిన ఈ నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. క్వజులు నాటల్ ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి పెగ్గీ కోన్‌యెనీ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాలోని భారత నర్సులు బొట్టు, ముక్కుపుడక, మంగళసూత్రాలను ధరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు.

ఇక్కడి వారు తమ వివాహ ఉంగరాలను ఎంత పవిత్రంగా భావిస్తారో, అలాగే భారతీయ మహిళలు తమ మంగళసూత్రాలు, సింధూరాలను భావిస్తారని చెప్పారు. వాటిపై తమకు అత్యంత గౌరవముందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి