బే ఏరియాలో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంప్రదాయాల్ని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ వేడుకలను బే ఏరియాలో ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు అతి వైభవంగా జరిగాయి.

సాంప్రదాయ దుస్తులు, పరికిణిల్లో మహిళలు, యువతులు పండుగ వాతావరణాన్ని సృష్టించారు. సుమారు వెయ్యి మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో రంగురంగు పుష్పాలతో తయారు చేసిన బతుకమ్మలను ప్రదర్శించారు. అనంతరం రేడియో గాయకుడు కీ.శే.మనప్రగడ నరసింహమూర్తి సతీమణి రేణుకాదేవి బతుకమ్మ గేయాలను ఆలపించారు.

సన్నీవేల్ మేయర్ టోనీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బే ఏరియాలో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించడంపై మేయర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర అధ్యక్షుడు ఆనంద్ కూచిబొట్ల, తానా అధ్యక్షుడు జయరాం కోమటి తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి