భారతీయ టీచర్లకు అమెరికా ఫెలోషిప్ ప్రోగ్రామ్

FILE
యునైటెడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యుసిఫ్) వచ్చే సంవత్సరం నిర్వహించే "ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్" కార్యక్రమాని అర్హులైన భారతీయ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. భారత పౌరులై ఉండి, ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఈ ఫెలో షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే.. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్న విద్యాధికారులు, విద్యా సమన్వయకర్తలు కూడా ఈ ఫెలో షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు డిగ్రీతో పాటు టీచర్ ట్రైనింగ్ చేసి ఉండాలి. కాగా.. ఈ ఫెలో‌షిప్‌కు ఎంపికయిన ఉపాధ్యాయులకు వెళ్లేందుకు, వచ్చేందుకు అవసరమైన విమానఛార్జీలను యుసిఫ్ అందిస్తుంది.

అమెరికాలో బస, భోజన వసతి సదుపాయాలతోపాటు ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తారు. వచ్చే ఏడాది ఆగస్ట్ డిసెంబర్ నెలల మధ్యలో జరిగే ఈ కార్యక్రమానికి 2009 జనవరి 15వతేదీ నాటికల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు గాయత్రీ సింఘాల్, యుసిఫ్, ఫుల్‌బ్రైట్ హౌస్, 12 హైలీ రోడ్, న్యూఢిల్లీ-110001 అనే చిరునామాను సంప్రదించాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి