సెయింట్ లూయిస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న అగ్ని మాపక సిబ్బందికి సాయం చేసింది. సెయింట్ లూయిస్‌లోని వైల్డ్ వుడ్, మాంచెస్టర్, బాల్విన్ నగరాల్లో అగ్నిమాపక సిబ్బందికి ఫిజ్జా లంచెస్ ఏర్పాటు చేసింది.
నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ సర్వీస్ కో-ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ విభాగం సమన్వయకర్త నాగ శ్రీనివాస్ శిష్ట్లాతో పాటు నాట్స్ వాలంటీర్లు అప్పలనాయుడు గండి, శివ కృష్ణ మామిళ్లపల్లి, శ్రీరామ్ కారుమూరి, రాజశేఖర్, ఈశ్వర్ యడ్లపల్లి, వెంకట్ పసుపులేటి, అయినగుండ్ల తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ పంపిణీకి తన వంతు సాయాన్ని అందించారు.
లాస్ ఏంజిల్స్‌లో ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ సాయం
లాస్ ఏంజెల్స్: అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం పని చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ 1500 డాలర్లు విరాళాన్ని అందించింది.
లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ఫుడ్ క్యాన్స్ సేకరించాలని ప్రయత్నించింది. కానీ ఫుడ్ క్యాన్స్ మార్కెట్‌లో అందుబాటులో లేకపోవడంతో విరాళాల ద్వారా సేకరించిన 750 డాలర్లకు నాట్స్ విభాగం మరో 750 డాలర్లు జోడించి 1500 డాలర్లను స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్‌కు అందించింది. ఇది నిరాశ్రయులైన పేదల ఆకలి తీర్చేందుకు స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్ వెచ్చించనుంది.