ఒబామా సలహామండలిలో మరో ఎన్నారైకి చోటు..!

FILE
అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా సాంస్కృతిక సలహా మండలిలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు లభించింది. సుప్రసిద్ధ ఇండియన్ అమెరికన్ అటార్నీ అమీ కే సింగ్‌ను "యూఎస్ ప్రెసిడెంట్స్ అడ్వెజరీ కమిటీ ఆన్ ఆర్ట్స్"కు ఎన్నిక చేసినట్లు వైట్‌హౌస్ అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

ప్రతిష్టాత్మక జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్‌ కళల అభివృధ్ధి కోసం అమీ కే సింగ్‌ను అధ్యక్షుడు ఒబామా సలహా మండలికి ఎంపిక చేసినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. చికాగోలోని హైస్కూల్ యువకులు కళల్లో రాణించేందుకు, సామాజిక అంశాలకు సంబంధించి వారిలో నాయకత్వ అంశాలను పెంపొందించేందుకు సింగ్ విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా వైట్‌హౌస్ కొనియాడింది.

జనరల్ కౌన్సిల్‌గా, డీడీబీ చికాగో ఇంక్ సీనియవర్ వైస్ ప్రెసిడెంట్‌గా, చికాగో ఆఫీస్ అసోసియేట్‌గా పలు బాధ్యతలను నిర్వహించిన ఈమె, సిడ్లీ అస్టిన్ ఎల్ఎల్‌పీగా అందరికీ సుపరిచితురాలు. అదే విధంగా చికాగో స్కూల్ ఆఫ్ ద ఆర్ట్ ఇనిస్టిట్యూట్ జూనియర్ బోర్డులో కూడా సభ్యురాలుగా ఉన్న సింగ్, ప్రస్తుతం మిక్వా ఛాలెంజ్ బోర్డులో పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఒబామా జన్మస్థలమైన చికాగోలో ప్రాంతాలవారీగా వినోద కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు మరియు మార్కెటింగ్ తదితర అంశాల్లో సింగ్ విశేష అనుభవం కలిగి ఉన్నారు. అలాగే వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించటం, వాటిని ప్రజలవద్దకు తీసుకెళ్లటం, టెలివిజన్ ప్రొడక్షన్‌లాంటి అంశాలలో ఆమె సైతం మంచి నైపుణ్యం కలిగి ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి