ఒబామా సాంస్కృతిక కమిటీలో రచయిత్రి ఝుంపా లహరి

FILE
ప్రముఖ భారత సంతతి రచయిత్రి, పులిట్జర్ అవార్డు గ్రహీత ఝుంపా లహరి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఏర్పాటు చేసిన సాంస్కృతిక, మానవతావాద కమిటీకి ఎంపికయ్యారు. ఈ సాంస్కృతిక కమిటీలో లహరితోపాటు చుక్ క్లోజ్, ఫ్రెడ్ గోల్డ్రింగ్, షైల్ జాన్సన్, పమేలా జాయ్‌నెర్, కెన్ సొలొమన్‌లు సభ్యులుగా ఉంటారని ఈ సందర్భంగా వైట్‌హౌస్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా అధ్యక్షుడు ఒబామా మాట్లాడుతూ.. తన పరిపాలనలో ఈ విశిష్ట వ్యక్తులు సేవ చేయనుండటం గర్వంగా భావిస్తున్నాని సంతోషం వ్యక్తం చేశారు. కళలు, మానవతావాదం సమాజంలో చైతన్యాన్ని రగిలించి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు స్ఫూర్తివంతంగా నిలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. ఝుంపా లహరి రచయిత్రిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఆమె రచనలు అంతర్జాతీయ ప్రశంసలతోపాటు పలు అవార్డులనుసొంతం చేసుకున్నారు. ఆమె మొదటి కథల సంకలనం "ఇంటర్‌ఫ్యూటర్ ఆఫ్ మ్యాలదిస్" పులిట్జర్ అవార్డును దక్కించుకోవటంతోపాటు.. పెన్/హెంమింగ్ వే అవార్డు, ది అడిసన్ ఎం మెటకాప్ అవార్డు, న్యూయార్క్ మ్యాగజైన్ ఇచ్చే డెబ్యూ ఆఫ్ ఇయర్ అవార్డులను సైతం గెలుచుకుంది.

అలాగే లహరి రాసిన "నేమ్‌సెక్" నవలా ప్రముఖ పుస్తకంగా న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలను అందుకుంది. అలాగే లాస్ ఏంజిల్స్ టైమ్స్ బుక్ ఫ్రైజ్ బరిలో చివరిదాకా నిలిచింది. ఇంకా ఈ రచనను యూఎస్ టుడే, ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ ఉత్తమ పుస్తకంగా కొనియాడాయి. ఇక లహరి తాజా కథల సంకలనం "అన్‌కస్టమ్డ్ ఎర్త్" ఫ్రాంక్ ఓ కార్నర్ అంతర్జాతీయ చిన్న కథల అవార్డును, వాలం బ్రోసా-గ్రేగర్‌వాన్ రెజోరీ బహుమతి సొంతం చేసుకోవటం విశేషం.

వెబ్దునియా పై చదవండి