చికాగోలో ప్రవాస భారతీయ మహిళ మృతదేహం లభ్యం.!!

FILE
గత జనవరి నెల నుంచి కనిపించకుండాపోయిన 32 సంవత్సరాల ప్రవాస భారతీయ మహిళ మృతదేహం చికాగోకు సమీపంలో లభ్యమైనట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. చికాగోకు దగ్గర్లోని మైనే టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న ఈ ఎన్నారై మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కుక్ కంట్రీ షెరీఫ్స్ అధికార ప్రతినిధి స్టీవ్ పీటర్సన్ ఈ విషయమై మాట్లాడుతూ.. సంగీతా జెన్ పాటిల్ అనే ఈ మహిళ మృతదేహాన్ని చికాగోకు సమీపంలోని డెస్ ప్లైనెస్ నది వద్ద ఆదివారం రోజున కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని పరిశీలించిన ఆరోగ్య అధికారి, ఆమె నీటిలో మునిగిపోవటంవల్ల మృతికిగల ఆధారాలను ఇదమిద్ధంగా చెప్పలేకపోతున్నారన్నారు.

కాగా.. పాటిల్ ధరించిన దుస్తులు, నగలను బట్టి ఆమె కుటుంబ సభ్యులు సులభంగానే గుర్తించారని పీటర్సన్ వివరించారు. ఇక పాటిల్ హత్యకు సంబంధించి ఆమె బంధువులు, పరిచయస్తులు అందరితోనూ మాట్లాడామనీ, కనిపించకుండా పోయేందుకు ముందు ఆమె ప్రవర్తన ఏ రకంగా ఉండిందన్న అంశాలను సైతం పోలీసు ఇన్వెస్టిగేటర్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి