హౌస్ ఆఫ్ కామన్స్‌కు తొలిసారిగా ఇద్దరు ఎన్నారై మహిళలు..!!

FILE
బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు ప్రవాస భారతీయ మహిళలకు ఆ దేశ హౌస్ ఆఫ్ కామన్స్‌లోకి ప్రవేశం లభించింది. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయ మైనారిటీలకు నేతృత్వం వహిస్తున్న ఈ ఇద్దరు మహిళలు ఆ దేశ సార్వత్రిక ఎన్నికలలో రెండు నియోజక వర్గాలలో విజయం సాధించి హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టబోతున్నారు.

ప్రవాస భారతీయ మహిళ ప్రీతి పటేల్ కన్జర్వేటివ్ పార్టీ తరపున బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌‌లో తొలిసారిగా అడుగుపెట్టబోతోంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో దేశంలోనే పెద్ద పార్టీ అయిన కన్జర్వేటివ్ తరపున వైథామ్ నియోజక వర్గం నుంచి ప్రీతి విజయం సాధించటంతో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆమెకు ప్రవేశం లభించింది.

అలాగే లేబర్ పార్టీ అభ్యర్థి వలేరీ వాజ్ సోదరి, ఇండియన్ ఆరిజన్ లేబర్ పార్టీ ఎంపీ కీత్ వాజ్ కూడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికయ్యారు. ఈమె వాల్‌సాల్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీపడి విజయం సాధించారు. కీత్ వాజ్ సోదరుడు వాజ్ కూడా లీసెస్టర్ ఈస్ట్ నుంచి విజయం సాధించారు. దీంతో ఓ సోదరుడు-సోదరీమణి కలిసి తొలిసారిగా హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికై రికార్డు సృష్టించారు.

ఇదిలా ఉంటే.. 2010 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ 325 సీట్లకుగానూ 163 సీట్లను దక్కించుకుని దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. తరువాత 123 సీట్లతో లేబర్ పార్టీ బ్రిటన్‌లో రెండో అతిపెద్ద పార్టీగా స్థానం దక్కించుకుంది.

వెబ్దునియా పై చదవండి