ఒలింపిక్ వీరులకు హర్యానా ప్రభుత్వ నజరానా

శనివారం, 23 ఆగస్టు 2008 (16:45 IST)
బీజింగ్ ఒలింపిక్ బాక్సింగ్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన బాక్సర్లకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ప్రస్తుతం పోలీసుశాఖలో తక్కవ స్థాయి ఉద్యోగాల్లో ఉన్న బాక్సర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ విషయమై హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రం నుంచి ఒలింపిక్‌లో అత్యంత ప్రతిభ కనబర్చిన విజేందర్, జితేందర్, అఖిల్ కుమార్‌లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించనున్నారు.

అదే సమయంలో క్వార్టర్స్‌కు చేరడం ద్వారా తన ప్రతిభ కనబర్చిన రెజ్లర్ యోగేశ్వర్ దత్‌ను కూడా డీఎస్పీగా నియమించనున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి