ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా సినిమా విశేషాలు పంచుకున్నారు.
దీప్తి: నాని, ప్రశాంతి గారు స్క్రిప్ట్ విని ఓకే చేశారు. నేను ఆన్సెట్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. నేను రోజు సెట్స్ లో వుండేదాన్ని. నాని, ప్రశాంతి నాకు చాలా ప్రీడమ్ ఇచ్చారు. నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా లేయర్స్ వున్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది. కథ నాకు చాలా నచ్చింది.
ప్రశాంతి: ప్రిమియర్స్ కి యునానిమస్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అఫ్ చూసి 'వావ్' అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. సెకండ్ హాఫ్ లోని హైలెట్స్ కూడా ఆడియన్స్ కి చాలా నచ్చాయి. రెస్పాన్స్ చాలా బావుంది. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం.
- ఈ కథకు మంచి యాక్టర్స్ కావాలి. ఆ విషయంలో రాజీ పడలేదు. ప్రియదర్శి తో పాటు రోహిణీ, సాయి కుమార్, శివాజీ, హర్ష వర్ధన్ .. ఇలా మంచి యాక్టర్స్ వున్నారు. రోషన్, శ్రీదేవి కూడా వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు.