ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు: కోటి

ఆనందం తట్టుకోలేకపోతున్నా. అభిమానుల పూజలు ఫలించాయి. సంగీత ప్రియులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఐ లవ్ యు రెహమాన్. నా దగ్గర పనిచేసినప్పుడు చిన్నతనంలో ఎలా ఉన్నాడో... ఈ రోజు ఆస్కార్ తీసుకుంటున్నప్పుడు అదే తీరులో కనిపించాడు.

నిజంగా గ్రేట్... జీవితంలో సాధించాల్సింది సాధించేశాడు. అల్లా అన్నీ సమకూర్చాడు. రెహ్మాన్ హాలీవుడ్ సౌండ్స్ అంటే చాలా ఇష్టపడేవాడు. ఆ రోజుల్లోనే అవి వినడానికి నానా కష్టాలు పడేవాళ్లం. ఓ ట్రాక్ వినడానికి 2 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకుని విన్నాం. రెహ్మాన్‌కు ఆస్కార్ దక్కితే నాకు వచ్చినంత ఆనందంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి