పందిళ్లపల్లి ధ్వజస్తంభం ఒరగడం.. అరిష్టానికి సంకేతమా..?

FILE
సుప్రసిద్ధ శ్రీ కాళహస్తీశ్వరాలయ రాజగోపురం కూలిన కొద్ది రోజుల్లోనే పందిళ్లపల్లి ధ్వజస్తంభం ఒరిగింది. నాలుగు శతాబ్ధాల చరిత్ర కలిగిన పందిళ్లపల్లి దేవస్థానంలోని ధ్వజస్తంభం శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలుల ధాటికి ధ్వజస్తంభం ఒరిగి, దేవస్థానంపైనే పడింది. ఏడుదశాబ్ధాల కాలంలో పందిళ్లపల్లి ధ్వజస్తంభం నేలకొరగడం ఇది రెండోసారి.

శుక్రవారం అర్థరాత్రికి తర్వాత వీచిన ఈదురు గాలుల ధాటికి ధ్వజస్తంభం ఒరగడం అరిష్టానికి సంకేతమేనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తీశ్వరాల రాజగోపురం కూలిపోవడంతో రాష్ట్రంలో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పురోహితులు హెచ్చరిస్తున్న తరుణంలో పందిళ్లపల్లి ధ్వజస్తంభం నేలకొరగడం భక్తులను మరింత ఆవేదనకు గురిచేసింది.

మరోవైపు.. ధ్వజస్తంభంలోని కొయ్యభాగం పూర్తిగా పాడైపోవడం, నిర్వాహ లోపమే పందిళ్లపల్లి ధ్వజస్తంభం కూలిపోవడానికి కారణమని స్థానిక ప్రజలు అంటున్నారు. కానీ పండితులు మాత్రం ఇది అరిష్టానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం పూట ధ్వజస్తంభం నేలకొరగడం అశుభమని పురోహితులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు శివ, విష్ణువులను శ్రద్ధగా పూజించడం ద్వారా అశుభ ఫలితాల నుంచి రాష్ట్ర ప్రజలు గట్టెక్కే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి