2014లో మీ రాశి ఫలితాలు... వివరాల కోసం క్లిక్ చేయండి

మంగళవారం, 31 డిశెంబరు 2013 (22:10 IST)
WD
మేషరాశి

ఆదాయం-14 వ్యయం-2 పూజ్యత-4 అవమానం-5

ఈ రాశికి జూన్ 18వ తేదీ వరకు తృతీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా చతుర్థము నందు, మే 10వ తేదీ వరకు జన్మము నందు కేతువు, సప్తమము నందు రాహువు, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు రాహువు, వ్యయము నందు కేతువు, నవంబరు 2వ తేది వరకు సప్తమము నందు శని ఆ తదుపరి అంతా అష్టమము నందు శని సంచరిస్తారు.

ఈ గోచారం పరీక్షించగా ''సిరిదావచ్చినా వచ్చును'' అన్నట్టుగా ఆర్ధికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు మీ సహాయాన్ని ఆర్ధిస్తారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆహార వ్యవహారాలలో మెళుకువ అవసరం. స్థిరాస్తులపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. రుణవిముక్తులవుతారు. వ్యాపారస్తులకు అనుకోని అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలోని వారికి సంక్షోభం తప్పదు.

భాగస్వాముల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అనురాగ వాత్సల్యాలు పెంపొందగలవు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్ రంగాలవారికి పనివారితో సమస్యలు తప్పవు. ఎదుటివారి కుటుంబ విషయాలలో తలదూర్చడం వల్ల మాటపడతారు. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాల వారికి అశాంతి అధికమవుతుంది. రావలసిన ధనం సకాలంలో అందటం వల్ల ఆర్ధికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం.

ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు, వృత్తులవారికి ఆశించినంత అభివృద్ధి ఉండదు. వైద్యరంగాలలోని వారికి పురోభివృద్ధి కానవస్తుంది. రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ఫ్యాన్సీ రంగాలలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కాంట్రాక్టర్లలు మంచి మంచి అవకాశాలు చేజార్చుకొనే అవకాశం ఉంది. చిన్న తరహా పరిశ్రమలవారికి సంతృప్తి అభివృద్ధి కానరాగలదు. విద్యుత్ లోపం వల్ల ఒత్తిడి అధికమవుతుంది. వివాహ శుభకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు హోటల్, క్యాటరింగ్, కూరగాయల వ్యాపారస్తులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఏజెంట్లకు, రియల్‌ఏస్టేట్, బ్రోకర్లకు శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలకు నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పానియ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానరాగలదు. ఒక లేఖ మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ తోటల రంగాలవారికి అశాంతి అధికమవుతుంది. విద్యా రంగాలవారికి సంతృప్తి అభివృద్ధి కానరాగలదు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ధనం ఏ మాత్రం నిలువ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఆల్కహాల్ వ్యాపారస్తులకు అభివృద్ధి కానవస్తుంది. స్థానచలనానికై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు తప్పవు. సినిమా, కళాకారులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. అంతరిక్ష పరిశోధకులకు, శాస్త్రజ్ఞులకు, రచయితలకు మంచి గుర్తింపు లభించలదు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.

మిర్చి, నూనె, కంది, జొన్న వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకోని అభివృద్ధి పొందుతారు. ఇతరులకు హామీలు ఉండటం వల్ల కానీ, ధనం ఇవ్వడంవల్ల కానీ సమస్యలను ఎదుర్కొనవలసివస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెట్రోలు, డీజిల్ వ్యాపారస్తులకు అభివృద్ధి పదంలో నడుస్తుంది. నిర్మాణం పథకాలలో మెళుకువ వహించండి. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. క్రయ విక్రయ రంగాలలో వారికి శుభదాయకం. దూర ప్రయాణాలపట్ల, విదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మాలనే ఆలోచన అధికమవుతుంది. సం||ము అంతా సత్‌ఫలితాలనే పొందుతారు అనే చెప్పవచ్చు.

ఈ రాశివారు లలితా సహస్రనామం చదవడం వల్ల లేక వినడం వల్ల సర్వదా అభివృద్ధి కానవస్తుంది. నెలకు ఒక గురువారం నాడు వరసిద్ధి వినాయకుడికి ఆవుపాలతో అభిషేకం చేయించినా పురోభివృద్ధి పొందుతారు.

అశ్వని నక్షత్రం వారు జీడి మామిడి, భరణి నక్షత్రం వారు దేవదారు, కృత్తికనక్షత్రం వారు అత్తి చెట్టును దేవాలయాల్లోగాని, విద్యా సంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లో గాని నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది.

అశ్వని నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం భరణి నక్షత్రంవారు వజ్రం, కృత్తికానక్షత్రం వారు జాతికెంపు లేక స్టార్ రూబిఅనే రాయిని అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు.

వృషభరాశి

ఆదాయం-8 వ్యయం-11 పూజ్యత-7 అవమానం-5

ఈ రాశివారికి మే 10వ తేది వరకు వ్యయము నందు కేతువు, షష్ఠమము నందు రాహువు, ఆ తదుపరి అంతా పంచమము నందు రాహువు, లాభము నందు కేతువు, జూన్ 18వ తేది వరకు ద్వితీయము నందు బృహస్పతి, ఆ తదుపరి తృతీయము నందు, నవంబరు 2వ తేది వరకు షష్ఠమము నందు శని, ఆ తదుపరి సప్తమము నందు సంచరిస్తారు.

ఈ గోచారం పరీక్షించగా ''సాధనమున పనులు సమకూరు ధరలోనా'' అన్నట్టుగా కృషితో సాధించలేనిది ఏదీ లేదని గమనించండి. వాతావరణంలోని మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆర్ధికంగా అభివృద్ధి కానవచ్చినా అశాంతి వంటివి అధికంగా ఉంటాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు నూతన ఆలోచనలు స్ఫురించగలవు.

నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిర్మాణ పథకాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు నూతన ఆలోచనలు స్ఫురించగలవు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిర్మాణ పథకాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. విద్యార్ధునులలో పురోభివృద్ధి కానవస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అనుకూలం. గృహంలో వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వ్యవసాయ తోటల రంగాలవారికి పురోభివృద్ధి కానరాగలదు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు.

కలప, ఇటుక, సిమెంట్ వ్యాపారస్తులకు సత్‌ఫలితాలు ఉండగలవు. విద్యార్థులలో ఏకాగ్రత లోపం వల్ల మాటపడతారు. ట్రాన్సుపోర్టు, ఎక్స్‌పోర్టు వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్నేహసంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్ చేయువారికి మెళుకవ అవసరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. కార్మికులకు, కర్షకులకు కలిసివచ్చేకాలం. ఇంజనీరింగ్ రంగాలవారికి లెక్కలలో తేడా రావడం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. పాడిపరిశ్రమ రంగాలలోని వారికి సామాన్యంగా ఉంటుంది. వారసత్వపు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వైజ్ఞానిక, శాస్త్రరంగాలలోనివారికి వైద్యులక, జ్యోతిష్యులకు, గణిత రంగాలలోని వారికి ఆశాజనకం.

ప్రేమానుబంధాలు బలపడతాయి. అనవసరపు ఖర్చులు అధికమవ్వడంవల్ల అశాంతికి లోనవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. పత్తి, ఎండుమిర్చి, పసుపు, మిరియాలు, జొన్న, వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివద్ధి కానరాగలదు. వస్త్రవ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. సినిమా, కళారంగాలపట్ల ఆసక్తి పెరగగలదు. ఉపాధ్యాయులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సం||ము మొదటి భాగంలో అనుకోని అభివృద్ధి కానవస్తుంది.

ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. స్త్రీలు కొత్త అనుభూతికి లోనవుతారు. పండ్ల, కూరగాయల వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. రియల్ ఏస్టేట్, వ్యాపారస్తులకు ఏజెంట్లకు, బ్రోకర్లకు, పనిభారం అధికమవుతుంది. మానసిక స్థిరత్వం తగ్గడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సాంకేతిక, రాజకీయ రంగాలలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. పీచు, లెదరు, ఫోమ్ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉండగలదు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహించండి.

హామీలు ఉండటం వల్ల కానీ, ధనం ఇవ్వడంవల్ల కానీ సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు అనుకోని అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఫ్యాన్సీ, కిరాణా, మందులు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ఆశాజనకరం. ఉద్యోగంలో అభివృద్ధికై చేయు ఫలితాలు అనుకూలించగలవు. రక్షకభటులకు మంచి గుర్తింపు, రాణింపు లభించగలదు. ఎదుటువారి తీరు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ కార్యక్రమాలలోనూ, శుభకార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటారు. క్రీడలపట్ల ఆసక్తి పెరుగగలదు. క్రయ విక్రయ రంగాలలోని వారికి శుభదాయకం. బంగారు, వెండి, లోహ, వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ చిన్నారుల గురించి ఆందోళన చెందుతారు. మొత్తం మీద ఈ సం||ము అంతా శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ రాశివారు లక్ష్మీనారాయణుడిని ఆరాధించడం వల్ల సర్పదోషాలు తొలిగిపోతాయి.

కృత్తికానక్షత్రం వారు అత్తిచెట్టును, రోహిణి నక్షత్రం వారు నేరేడు. మృగశిర నక్షత్రం వారు మారేడు దేవాలయాల్లోగాని, విద్యాసంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లోగాని నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది. కృత్తికా నక్షత్రం వారు పుచ్చుకెంపు లేక స్టార్‌రూబి, రోహిణి నక్షత్రం వారు స్పందనముత్యం లేక జాతి ముత్యం, మృగశిరనక్షత్రం వారు జాతి పగడం ధరించిన శుభం కలుగుతుంది.

మిథునరాశి

ఆదాయం-11 వ్యయం-8 పూజ్యత-3 అవమానం-1

ఈ రాశి వారికి మే 10వ తేది వరకు పంచమము నందు రాహువు, లాభము నందు కేతువు, ఆ తదుపరి అంతా చతుర్థము నందు రాహువు, రాజ్యము నందు కేతువు. జూన్ 18వ తేదీ వరకు జన్మము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా ద్వితీయము నందు, నవంబరు 2వ తేది వరకు పంచమము నందు శని, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు సంచరిస్తారు.

ఈ గోచారం పరీక్షంచగా ''అజగామ యదాలక్ష్మీ నారీకేళ ఫలం భువత్'' అన్నట్లుగా ధనం సమయానికి సమకూరడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితిలో స్థిరపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. ఏజెంట్లకు, రియల్‌ఏస్టేట్, బ్రోకర్లకు పురోభివృద్ధి కానరాగలదు. మిర్చి, నూనె, అపరాల స్టాకిస్టులకు ఆశాజనకం. వృత్తుల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆరోగ్యములో అధికమమైన జాగ్రత్త అవసరం.

మీ సహాయం పొంది మీమీద అపవాదులు వేయడంవల్ల ఆందోళనకు గురవుతారు. కళ, క్రీడా రంగాలవారికి కలిసివచ్చే కాలం. మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారస్తులకు ఒత్తిడి పెరిగినా సత్‌ఫలితాలు పొందుతారు. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. ఒక్కోసారి పెద్దలతో ఏకీభవించలేకపోతారు. స్నేహితులతో గడపటం వల్ల విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటారు. శాస్త్రజ్ఞులకు కళాకారులకు, జ్యోతిష్కులకు, గణిత రంగాలలోనివారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు అధికంగా సంభాషించడం వల్ల మాటపడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ భర్త వైఖరి కానీ, మీ కుటుంబీకుల వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

విందులు వినోదాలలో పాల్గొంటారు. వైద్యుల సలహా మంచిది. ఉపాధ్యాయులకు విద్యాసంస్థలలోని వారికి ఊహించని సమస్యలు, అపవాదులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కార్మికులకు చేతి పనివారికి, తాపీ మేస్త్రీలకు, కార్పెంటర్లకు, కలిసివచ్చేకాలం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాలవారికి సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. నిత్యావసర వ్యాపారులకు, స్టాకిస్టులకు, అనుకోని గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడంవల్ల మాటపడతారు. కూర, పండ్ల, పూల, పానీయ వ్యాపారస్తులకు అభివృద్ధి కానవస్తుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. చిన్న తరహా పరిశ్రమలవారికి చికాకులు తప్పవు.

వాణిజ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టండి. ప్రభుత్వం నుండి ఆహ్వానాలు లభించగలవు. పీచు, ఫోమ్, కంబళి, లెదర్ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఎదుటివారికి వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రుణం తీర్చడానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు కొత్త కొత్త అనుభూతులకు లోనవుతారు. ఉత్తరప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. బంగారు వ్యాపారస్తులకు పనివారితో మెళుకువ అవసరం. వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రభుత్వ రంగ సంస్థలలోని వారికి బదిలీలు జరిగే ఆస్కారం ఉంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు.

గత అనుభవాలు గతజ్ఞప్తికి రాగలవు. పొగాకు, పత్తి, మిర్చి, నూనె, జొన్న, జీడివ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉండగలదు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. క్రీడా రంగాలలోనివారికి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అకౌంట్స్ రంగాలలోని వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. అంతరిక్షపరిశోధకులు అపవాదులు ఎదుర్కొనక తప్పదు. మీ చిన్నారుల గురించి చర్చిస్తారు. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాలలో వారికి సంక్షోభం అధికమవుతుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు సంతృప్తి అభివృద్ధి కానవస్తుంది. ఈ సం||ము అంతా అనుకోని అభివృద్ధి కానవస్తుంది.

ఈ రాశివారు పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించినా ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టు, ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును, పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం లేక వైక్రాంతమణి అనే రాయిని ధరించిన శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి

ఆదాయం-5 వ్యయం-8 పూజ్యత-6 అవమానం-1

ఈ రాశివారికి జూన్ 18వ తేది వరకు వ్యయము నందు బృహస్పతి తదుపరి అంతా జన్మము నందు, మే 10వ తేది వరకు చతుర్థము నందు రాహువు, రాజ్యము నందు కేతువు, ఆ తదుపరి అంతా జన్మము నందు, మే 10వ తేది వరకు చతుర్థము నందు రాహువు, రాజ్యము నందు కేతువు, ఆ తదుపరి తృతీయమునందు రాహువు, భాగ్యము నందు కేతువు. నవంబరు 2వ తేది వరకు చతుర్థము నందు శని ఆ తదుపరి అంతా పంచమమునందు సంచరిస్తాడు.

ఈ గోచారం పరీక్షించగా అర్ధాష్టమ శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ఓర్పు, నేర్పు, సహనం చాలా అవసరం అని గమనించండి. "సర్వం ఆత్మవసం సుఖం, సర్వం పరవసం దుఖ:" అన్నట్టుగా మనో నిగ్రహంతో, ఏకాగ్రతతో, ధ్యాసతో, ధ్యెయంతో అనుకున్నది సాధించండి. ఖర్చులు అధికంగా ఉన్నందువల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఇతరుల కారణంగా మీరు మాటపడతారు. వ్యవసాయ తోటల రంగాలవారికి అభివృద్ధి కానరాగలదు. కోళ్ళ, గొర్రెల, మత్స్య, వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది.

దంపతుల మధ్య దాపరికం, పట్టుదల కూడదు. రెడీమేడ్ వస్త్ర వ్యాపారాలు, ఫ్యాన్సీ, పచారి, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాల్లో స్వల్ప లాభం, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యవహారాలు, ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. నిరుద్యోగుల ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించుకోవటం క్షేమదాయకం. విద్యార్థులు క్యాంపస్ ఎంపికల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

క్రీడ, కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్ధిరాస్తుల మూలక ధనం చేతికందుతుంది. కుటుంబీకులు, ఆత్మీయుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరగలదు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులే లబ్ధిపొందుతారు. ముఖ్యమైన పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు ప్రతిభా పోటీలు, టీవీ ఛానెల్ కార్యక్రమాల్లో రాణిస్తారు. బంధువుల ఆకస్మికరాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంటా బయటా సమస్యలు, పనిఒత్తిడిలో సతమతమవుతారు.

ఓర్పు, లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. భవన నిర్మాణ, ముఠా కార్మికులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. సాహసకృత్యాలు, అనుభవం లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు స్వల్ప లాభాలు గడిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణ దిశగా మీ ఆలోచనలుంటాయి. రావలసిన బిల్లులు మంజూరుకావటంతో పనులు పున:ప్రారంభమవుతాయి. ప్రముఖులు, వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు తప్పవు. ఒక వ్యవహరం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణాల్లో ఊహించని చికాకులెదుకవుతాయి. కోళ్ల, మత్స్య, పొడి రంగాల వారికి పురోభివృద్ధి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు.

ఈ రాశివారు లక్ష్మీనరసింహస్వామిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది. ఈ క్రింది శ్లోకాన్ని 19సార్లు పశ్చిమ ముఖంగా తిరిగి పటించినా లేక నవగ్రహాల చుట్టూ 10సార్లు ప్రదక్షణ చేస్తూ ఈ మంత్రాన్ని పటించినా శనిదోషం తొలగిపోతుంది.

'నీలాంజన సమభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం||'

పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టును, పుష్యమి నక్షత్రం పిప్పలి చెట్టును, ఆశ్లేషనక్షత్రం వారు బొప్పాయి చెట్టును, దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లోగాని నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది.

పునర్వసు నక్షత్రం వారు కనకపుష్య రాగం కాని లేక వైక్రాంతమణి గాని, పుష్యమి నక్షత్రం వారు జాతినీలం లేక పుష్యనీలం, ఆశ్లేష నక్షత్రం వారు జాతిపచ్చ లేక గరుడపచ్చ అనే రాయిని ధరించినా శుభం కులుగుతుంది.

సింహరాశి

ఆదాయం-8 వ్యయం-2 పూజ్యత-2 అవమానం-4

ఈ రాశి వారికి మే 10వ తేదీ వరకు తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు రాహువు, అష్టమము నందు కేతువు, జూన్ 18వ తేదీ వరకు లాభము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా వ్యయం నందు, నవంబర్ 2వ తేదీ వరకు తృతీయము నందు శని, ఆ తదుపరి అంతా చతుర్థము నందు సంచరిస్తాడు.

మీ గోచారం పరీక్షించగా "పూర్వదత్తేషు యా ధనం" అన్నట్లుగా ఆర్థికంగా ముందుకు వెళ్ళిన ఊహించని ఒత్తిడి, చికాకులు, ఆందోళన వంటివి అధికంగా ఉంటాయి. ద్వితీయ భాగము నందు చేసే పనియందు ఏకాగ్రత, ధ్యాసచాలా అవసరమని గమనించండి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం అధికంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. ముఖ్యుల్లో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఎదుటివారి కారణంగా అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. చిన్నతరహా పరిశ్రమలో వారికి సదవకాశాలు లభిస్తాయి.

గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. స్త్రీలకు ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఇతరుల ప్రభావానికి లోనుకాకండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికం అవుతుంది. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. గృహంలో సందడి, ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మీ శ్రీమతి, సంతానం కోరికలు నెరవేర్చగల్గుతారు. ఖర్చులు, చెల్లింపులు మీస్తోమతకు తగ్గట్టుగానే ఉంటాయి. ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అపరిచితులతో జాగ్రత్తగా మెలగాలి. ఆర్ధిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. షాపు గుమస్తాలకు ఒత్తిడి, పనిభారం అధికం. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి కాగలవు.

వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. మీ బాధ్యతాయుత ప్రవర్తన అధికారులను ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది. పత్రికా, వార్తా సిబ్బందికి ఏకాగ్రత లోపం, ఇతరత్రా చికాకులుఅధికం. స్త్రీలకు కళాత్మక పోటీల్లో నిరుత్సాహం తప్పదు. గత సంఘటనలు పునరావృతం అయ్యే సూచనలున్నాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు గుర్తింపు, ఖ్యాతి పొందుతారు. జూదాలు, బెట్టింగ్‌ల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. సన్మానాలు, సభల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికమైనా భారమనిపించవు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.

మీపై సెంటిమెంట్లు, ఎదుటివారి వ్యాఖ్యల తీవ్ర ప్రభావం చూపుతాయి. నూతన వ్యాపారాల్లో నష్టాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల గడువు పెంపులో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. పత్రికా సంస్థలలోని వారికిమార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. క్రీడ, సంగీత, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు.

షాపుగుమస్తాలు, ముఠాకార్మికులు, చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పెండింగ్ పనుల పూర్తిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిరుత్సాహం, పనిభారం వంటి చికాకులు అధికం. వాహనం, విలువైన సామగ్రి మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభసంకేతాలున్నాయి. ప్రేమికులకు సన్నిహితుల ఆదరణ లభిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం అంతా ఊహించని చికాకులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలించవు.

2014 నవంబర్ నుండి అర్థాష్టమ శనిదోషం ప్రారంభమవుతున్నందువల్ల ఈ రాశివారు ప్రతిశనివారం 10 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించిన శుభం కలుగుతుంది.

శ్లో|| మాషాంశ్చతాలం విమలేంధ్రనీలం| స్థలా: కుళుద్దామహిచలోహం||
సదక్షిణం చేతివదంతినూనం| దుష్టాయదానం రవినందనాయ||

ఈ రాశివారు ప్రతిరోజు దేవి ఖడ్గమాల చదవటం వల్ల లేక వినటం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.

మఖ నక్షత్రం వారు మర్రి చెట్టును, పుబ్బనక్షత్రం వారు మెదుగ, ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టును దేవాలయాలలోని కానీ విద్యా సంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటి ఈ చెట్ల అభివృద్ధికి దోహదపడండి మీ సంకల్పం సిద్ధిస్తుంది. మఖ నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, పుబ్బ నక్షత్రం వారు వజ్రాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జాతికెంపు లేక పుచ్చుకెంపు లేక స్టార్‌రూబి అనే రాయిని ధరించినా సర్వదా శుభం కలుగుతుంది.

కన్యరాశి

ఆదాయం-11 వ్యయం-8 పూజ్యత-5 అవమానం-4

ఈ రాశి వారికి మే 10వ తేదీ వరకు ద్వితీయము నందు రాహువు, అష్టమము నందు కేతువు, ఆ తదుపరి అంతా జన్మమము నందు రాహువు, సప్తమము నందు కేతువు, నవంబర్ 2వ తేదీ వరకు ద్వితీయము నందు శని, ఆ తదుపరి అంతా తృతీయము నందు, జూన్ 18వ తేదీ వరకు రాజ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా లాభము నందు సంచరిస్తాడు.

మీ గోచారం పరీక్షించగా "గుణలబ్ధ: స్వయమేవ సంపద:0" అన్నట్లుగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధుమిత్రుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఏలినాటి శనిదోషం ఉన్నప్పటికీని ఈ శనిమీకు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తాడు. స్థిరాస్తుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఇతరుల కారణాల వల్ల, మీ కార్యక్రమాలు వాయిదా వేయటం వల్ల ఆందోళనకు గురవుతారు. బంగారు, వెండి, లోహ వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు, తప్పదు.

వాహనం అమర్చుకోగలుగుతారు. విద్యార్థులకు అంకితభావం చాలా అవసరం అని గమనించాలి. నిత్యవసర వస్తు స్టాకిస్టులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రేమానుబంధాలు బలపడగలవు. ఫ్యాన్సీ, కిరాణా, మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఏప్రిల్ తదుపరి ఇతరుల కారణంగా మీరు మాటపడే ఆస్కారం ఉంది జాగ్రత్త అవసరం. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి అశాంతి, ఆందోళన పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారు మార్పులు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యా, సాంకేతిక రంగాల్లో వారికి గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. పారిశ్రామిక రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తగలవు.

కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వాయిదా పడటం వల్ల ఆందోళన తప్పదు. నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉత్తర ప్రత్యత్తరాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. అపరాలు, ధాన్యం వ్యాపారస్తలకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు. ఇతరుల ప్రభావానికి లోనుకాకండి. సిమెంటు, కలప, ఐరన్ వ్యాపారస్తులకు ఆశించినంత అభివృద్ధి ఉండదు. విదేశాల పట్ల, దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో ఏదైన వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీల సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు వాక్‌చాతుర్యానికి గుర్తింపు లభిస్తుంది.

శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు, జ్యోతిష్య రంగాల్లో వారికి, గణిత రంగాల్లో వారికి అనుకోకుండా అభివృద్ధి కానరాగలదు. ఫైనాన్సు, చిట్‌ఫండ్ రంగాల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కుటుంబీకులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు చికాకులు తప్పవు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ది కానవస్తుంది. శుభకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు మంచి మంచి అవకాశాలు లభించగలవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటం వల్ల అవరోధాలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో మెలకుల అవసరం.

మొత్తం మీద ఈ సంవత్సరం అంతా సత్ఫలితాలు పొందుతారనే చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ క్రింది శోకాన్ని ప్రతీరోజు 20 సార్లు పటించి లలితా త్రిపురసుందరిదేవిని ఎర్రని పూలతో ఆరాధించినా, సర్వదోషాలు తొలిగిపోతాయి.

పాత రుదామి లలితే? తవ పుణ్యనామ! కామేశ్వరీత కమలేసి మహేశ్వరీకతిన|
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేకి, వాగ్దేవతేతి వచసా త్రిపురేషశ్వ||

వర్తమానం ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ఈ రాశివారు ప్రతిశనివారం 17సార్లు నవగ్రహ ప్రదిక్షిణ చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించిన శుభం కలుగుతుంది. ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్న:శనిప్రచోదయాత్||

ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టును, హస్త నక్షత్రం వారు కుంకుడు చెట్టును, చిత్తా నక్షత్రం వారు జాతి పగడం అనే రాయిని ధరించినా శుభం కలుగుతుంది.

తులారాశి

ఆదాయం-8 వ్యయం-11 పూజ్యత-1, అవమానం-7

ఈ రాశివారికి మే 10వ తేదీ వరకు జన్మమమునందు రాహువు, సప్తమము నందు కేతువు, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు, జూన్ 18వ తేదీ వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా రాజ్యము నందు సంచరిస్తారు.

ఈ రాశివారు ''తన శాంతమే తనకు రక్ష'' అన్నట్లుగా ఓర్పు, నేర్పు, సహనంతో అనుకున్నది సాధించండి. ఏలినాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. రుణాలు అధికం అయ్యే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రేమికులకు మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చకండి. మీ వాక్చాతుర్యానికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.

చిన్నతరహా పరిశ్రమల్లో వారికి, చిరు వ్యాపారస్తులకు చికాకులు తప్పవు. అవివాహితులు శుభవార్తలు వింటారు. వాహన చోదకులకు మెళకువ అవసరం. రాజకీయాల్లో వారు సంక్షోబాన్ని ఎదుర్కొంటారు. శాస్త్రజ్ఞులకు కళాకారులకు, రచయితలకు, మీడియా రంగాల్లో వారికి అనుకోని గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. బిల్డర్లకు, ఇంజనీర్ రంగాల్లో వారికి సహనంతో అనుకున్న పనిసాధించగలుగుతారు. వైద్యులకు మతిమరుపు పెరగటం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. స్త్రీలు కొత్త కొత్త అనుభూతులకు లోనవుతారు.

బంగారం, వెండి, వస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోస్టల్ రంగాల్లో వారికి సమస్యలు తప్పవు. కోళ్ళ, మత్స్య పాడి, పరిశ్రమ రంగాల్లో వారికి శ్రమ అధికమైనప్పటికిని సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏజెంట్లు, బ్రోకర్లు, లైఫ్ ఇన్సూరెన్స్ రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి కానవస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ప్రత్తి, మిర్చి, పొగాకు, కంది వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యాసంస్థల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అయ్యే ఆస్కారం ఉంది. ఆరోగ్యంలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.

లిటిగేషన్ వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం. మీ పెద్దల గురించి ఆందోళన చెందుతారు. చిన్న తరహా పరిశ్రమల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తగలవు. వస్త్ర రంగాల్లో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యులకు బహుమతులు అందచేస్తారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. లెదర్, పీచు, ఫోం వ్యాపారస్తులకు సామాన్యంగా ఉండగలదు. ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఖర్చులకు సరిపడ ధనం సమకూరుతుంది. రంగులు, సుగంధ ద్రవ్య, ఎరువుల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.

సంగీత, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నాలలో సఫలీకృతులౌతారు. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆంతరంగిక వ్యవహారాలు బయటకి వ్యక్తం చేయకండి. పాత సమస్యలు ఒక కొలిక్కి తెస్తారు. వేళతప్పి ఆహారం భుజించడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తగలవు. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. మొత్తం మీద సంవత్సరం అంతా శ్రమ అనంతరం సత్ఫలితాలు ఉండగలవు.

ఈ రాశివారు ప్రతి మాసశివరాత్రి ఈశ్వరునికి అభిషేకించి, బిల్వదళాలతో అర్చించి, తీర్థం తీసుకున్న దోషాలు తొలగిపోతాయి. ప్రతి శివరాత్రి ఈశ్వరునికి అభిషేకించి, బిల్వదళాలతో అర్చించి, తీర్థం తీసుకున్న దోషాలు తొలగిపోతాయి. ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించిన సర్వదా శుభం కలుగుతుంది.

శ్లో|| నీలాంజన సమభాసం, రవి పుత్రం యమాగ్రజమ్|
ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం||

చిత్తా నక్షత్రం వారు తాటిచెట్టును, స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును, విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టును దేవాలయాలలో కానీ విద్యాసంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటి ఈ చెట్టు అభివృద్ధికి దోహదపడండి మీకు అభివృద్ధి కానవస్తుంది.

చిత్తా నక్షత్రం వారు జాతి తెల్లపగడాన్ని, స్వాతి నక్షత్రం వారు ఎర్ర గోమేధికాన్ని, విశాఖ నక్షత్రం వారు వైక్రాంతమణి లేక కనకపుష్యరాగాన్ని ధరించినా మీకు శుభం జయం కానవస్తుంది.

వృశ్చికరాశి

ఆదాయం-14 వ్యయం-2 పూజ్యత-4 అవమానం-7

ఈ రాశి వారికి మే 10వ తేదీ వరకు వ్యయమునందు రాహువు, షష్ఠమము నందు కేతువు, ఆ తదుపరి అంతా పంచమము నందు కేతువు, లాభము నందు రాహువు, నవంబర్ 2వ తేదీ వరకు వ్యయము నందు శని ఆ తదుపరి అంతా జన్మమము నందు, జూన్ 18వ తేదీ వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు సంచరిస్తారు.

మీ గోచారం పరీక్షించగా "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అన్నట్లుగా చేసే పనిపట్ల ఏకాగ్రత వహించడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఏలినాటి శనిదోషం ఉన్నప్పటికి ఈ శని మీకు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఆహార, వ్యవహారాల్లోగాని, కుటుంబ వ్యవహారాల్లో గాని జాగ్రత్త అవసరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పురోభివృద్ది కానవస్తుంది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకు అధికం అవుతాయి. స్థిరాస్తులు అమర్చుకుంటారు. ప్రయాణాల్లో మెళకువ అవసరం. శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు, క్రీడాకారులకు, ఆడిటర్లకు, వైద్యరంగాల్లో వారికి ఆశాజనకం. ప్రత్తి, పొగాకు, గోధుమ వ్యాపారస్తులకు సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు ఆరాధన అధికం అవుతుంది.

సిమెంటు, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు సంతృప్తికానరాదు. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ఆందోళన అధికం కాగలదు. వివాహ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. రచయితలకు, మీడియా రంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టటం వల్ల జయం లభించగలదు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీలో వేదాంత ధోరణి, నిరుత్సాహం అధికం కాగలదు. స్త్రీలకు అనుబంధాలు బలపడగలవు. కాళ్ళ, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.

ఉపాధ్యాయులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. విద్యార్థులకు మతిమరుపు పెరగటం వల్ల ఆందోళన తప్పదు. మీ ప్రేమ వ్యవహారాలు ఇతరులకు తెలియజేయడం వల్ల ఊహించని సమస్యలు తలెత్తగలవు. బంగారం, వెండి వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. సాంకేతిక, అకౌంట్స్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు లభించగలవు. నిరుద్యోగులకు అనుకోని అవకాశం లభిస్తుంది. ఐరన్, సిమెంటు, కలప వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం.

న్యాయవాదులకు, వృత్తుల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారి ప్రభావానికి లోనుకాకండి. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి సత్‌ఫలితాలు లభించగలవు. రాజీకాయాల్లో వారు ఎత్తుకు పై ఎత్తు వేయడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. కంది, మిర్చి, నూనె, ధాన్యం, మినుము వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. కొంతమంది మాట, తీరు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. స్పెక్యులేషన్ చేయువారికి శుభదాయకం. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సమస్యలు తెచ్చిపెట్టగలదు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు లాభదాయకం. గృహంలో సందడి కానరాగలదు.

ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు రావలసిన ధనం సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. పౌరోహితులకు, గణితరంగాల్లో వారికి, శాస్త్రజ్ఞులకు, సిద్ధాంతులకు వారివారి రంగాల్లో పురోభివృద్ధి పొందుతారు. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి బరువు బాధ్యతలు అధికం అవుతాయి. వారసత్వపు వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కార్మికులు సమిష్టి కృషి చేయటం వల్ల సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. మిమ్మల్ని చూసి అశూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. అసందర్భపు మాటల వల్ల భాగస్వామ్యుల మధ్య విభేదాలు తలెత్తగలవు. మొత్తంమీద ఈ సంవత్సరం అంతా శ్రమకు తగిన సత్ఫలితాలు పొందుతారు. ధనం నిలిపే ప్రయత్నం చేసి సఫలీకృతులు కండి.

ఈ రాశివారు కార్తీకేయునికి ఎర్రని పూలతో పూజించడం వల్ల, సంకల్పసిద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది. ఈ రాశివారు 19 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించిన సర్వదా శుభం కలుగగలదు.

ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్న:శని ప్రచోదయాత్||

విశాఖనక్షత్రం వారు మొగలి మొక్కను, అనురాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జ్యేష్ఠనక్షత్రం వారు కొబ్బరి మొక్కను, దేవాలయాల్లో గాని, విద్యాసంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లో గాని, నాటి దాని అభివృద్ధికి పాటుపడిన శుభం కలుగుతుంది.

విశాఖ నక్షత్రం వారికి కనకపుష్యరాగం, అనూరాధ వారికి పుష్యనీలం, జేష్ఠవారికి గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. ఈ రాశివారు ప్రతి శనివారం 9సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించిన కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కార్తీకేయుని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగి పోగలవు.

ధనూరాశి

ఆదాయం-2 వ్యయం-11 పూజ్యత-7 అవమానం-7

ఈ రాశివారికి జూన్ 18వ తేదీ వరకు సప్తమము నందు బృహస్పతి ఆతదుపరి అంతా అష్టమము నందు, మే 10వ తేదీ వరకు పంచమము నందు కేతువు, లాభము నందు రాహువు, ఆ తదుపరి అంతా చతుర్థము నందు కేతువు, రాజ్యము నందు రాహువు, నవంబర్ 2వ తేదీ వరకు లాభము నందు శని, ఆ తదుపరి అంతా వ్యయమునందు సంచరిస్తాడు.

మీ గోచారం పరీక్షించగా ''అరక్షితం తిష్ఠతి దైవ రక్షితం'' భగవంతుని కృప మీకు ఉన్నందువల్ల ఎటువంటి సమస్యలు తలెత్తినప్పటికి కూడా తెలివితో పరిష్కరించి అనుకున్నది సాధించగలుగుతారు. ఎటువంటి కష్టాన్నైనా ఓర్పుతో, నేర్పుతో ఏకాగ్రతతో అనుకున్నది సాధించండి. మీ కష్టానికి తగిన ప్రతఫలం ఉంటుంది. పరిశోధనా రంగాల్లో వారికి కళాకారులకు, శ్రామికులకు, పత్రికా, మీడియా రంగాల్లో వారికి ఒత్తిడి అధికం అయిన సత్ఫలితాలు పొందుతారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. క్రీయాశీలక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మీ సహాయం పొంది మీమీద అపవాదులు వేసేవారు అధికం అవుతారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి.

పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడవగలవు. ఋణవిముక్తులు అవుతారు. పోస్టల్, కొరియర్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. కొబ్బరి, పండ్ల, పానీయ, కూరగాయ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఏదైనా అమ్ముదామనే ఆలోచనలు అధికం అవుతాయి. విద్యారంగాల్లో వారికి ఏకాగ్రత చాలా అవసరం. కొత్తకొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తగలవు. మీ పెద్దల మాట విని ఆశించినంత సత్ఫలితాలు ఉండవు. ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.

ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు ఉండగలవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. వాహనం నడుపువారికి, వాహనచోదకులకు చిన్నచిన్న ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. వైద్యుని సలహా తప్పదు. వస్త్ర వ్యాపారస్తులకు ఆశాజనకం. భాగస్వామ్యుల మధ్య విభేదాలు తలెత్తగలవు. కోళ్ళు, మత్స్య, పాడిపరిశ్రమ రంగాల్లో వారికి సత్ఫలితాలు లభించగలవు. వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కొంతమంది మిమ్మల్ని ధనసహాయం అర్థిస్తారు. ధన సహాయం చేసిన ఇబ్బందులకు లోనవుతారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు, ఆడిటర్లకు, వైద్యులకు, నర్సులకు వారి వారి రంగాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. ఐరన్, సిమెంటు, కలప వ్యాపారస్తులకు లాభదాయకం. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. స్త్రీల మనోవాంఛలు నెరవేరగలవు మంచి మంచి వస్తువులు అమర్చుకోగలుగుతారు. నరాలకు సంబంధించిన చికాకులు తలెత్తగలవు జాగ్రత్త వహించండి. విద్యాసంస్థల్లోవారికి అనుకోని అభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం తప్పదు. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి చిన్నచిన్న ప్రమాదాలు జరుగవచ్చు.

పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానరాగలదు. పత్రికా రంగాల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రాజకీయాల్లో వారు అపనిందలు ఎదుర్కొని అనుకున్నది సాధించగలుగుతారు. స్త్రీల పరిచయాలలో మెళకుల అవసరం. కోళ్ళ, మత్స్య, చిన్న తరహా, పరిశ్రమల్లో వారికి సత్ఫలితాలు ఉండగలవు. పారిశ్రామిక రంగాల్లో వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టండి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఆరాధన అధికం కాగలదు. రిప్రజెంటివ్‌లకు ఊహించని ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి. మొత్తంమీద సంవత్సరం అంతా శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. ఈ రాశివారికి మొదటిభాగంలో పురోభివృద్ధి కానవస్తుంది.

ఈ రాశి వారు లక్ష్మీగణపతిని తెల్లని పూలతో పూజించడంవల్ల సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. అష్టమ గురుదోషం వల్ల ఈ క్రింది శ్లోకాన్ని 16సార్లు పఠించిన సర్వదా శుభం కలుగుతుంది.

ఓం సుర్యాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నోగురు: ప్రచోదయాత్||

మూల నక్షత్రం వారు వేగి చెట్టును, పూర్వాషాడ నక్షత్రం వారు నిమ్మ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును ఖాళీ ప్రదేశాల్లోగాని, దేవాలయాల్లోగాని, విద్యాసంస్థల్లో గాని నాటి దాని అభివృద్ధికి దోహం చేసిన శుభం కలుగుతుంది.

మూల నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, పూర్వాషాడ వారు వజ్రం, ఉత్తరాషాడ వారు స్టార్‌రూబి లేక జాతికెంపును ధరించిన శుభం కలుగుతుంది. ఈ రాశివారు గజలక్ష్మీదేవిని, ఆంజనేయుని ఆరాధించినా మనోసిద్ధి చేకూరుతుంది.

మకరరాశి

ఆదాయం-5 వ్యయం-5 పూజ్యత-3 అవమానం-3

ఈ రాశివారికి మే 10వ తేదీవరకు చతుర్థము నందు కేతువు, రాజ్యము నందు రాహువు. ఆ తదుపరి అంత తృతీయము నందు కేతువు భాగ్యము నందు రాహువు. జూన్ 18వ తేది వరకు షష్టమము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా సప్తమము నందు, నవంబరు 2వ తేది వరకు రాజ్యము నందు శని ఆ తదుపరి అంతా లాభమునందు సంచరిస్తారు.

ఈ గోచారం పరీక్షించగా ''ఐశ్వరం ఈశ్వరచేత్'' అన్నట్టుగా ఈశ్వర ఆరాధన వల్ల ఐశ్వర్యం, అభివృద్ధి, సంకల్ప సిద్ధి చేకూరుతుంది. ఆరోగ్యములో మెళుకువ అవసరం ఒక్కొసారి మీ కుంటింబీకుల వైఖరిమీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులకు అనుకున్నంత సంతృప్తికానరాదు. బంధుమిత్రుల ధోరణి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కళా కారులకు, సైన్సు రంగాలవారికి, పరిశోధకులకు, సాంకేతిక రంగాలలోని వారికిమంచి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన అగ్రిమెంట్‌లు వాయిదా పడుట వల్ల ఆందోళన చెందుతారు.

స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. పాత వ్యవహారాలను జ్ఞప్తికి తెచ్చుకొని కాలం వ్యర్థం చేయకండి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వస్త్ర, బంగారు, లోహ, వెండి వ్యాపారస్తులకు అశాంతి తప్పదు. కాంట్రాక్టర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. వృత్తులవారికి ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ఇచ్చుపుచ్చుకొనే వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. రుణాలు ఏ కొంతైనా తీర్చుతారు. మతపరమైన విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పెట్టుబడులకు ఈ సం||ము ఎంతో అనుకూలం. ముఖ్యుల నుంచి ఆహ్వానాలు మీకు ఎంతో సంతృప్తినిస్తుంది.

సంతానం వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపారాభివృద్ధికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులను మెప్పిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి.

కుటుంబీకుల మీ మాటకు అంతగా విలువనివ్వరు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ కార్యక్రమాలు, వ్యవహారాలు ఆశించినంత చురుకుగా సాగవు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకాగ్రత ముఖ్యం. ఫైనాన్సు, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులనుంచి ఒత్తిడి అధికం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి.

అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. వైద్యులకు శస్త్రచికిత్సలు చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. విద్యార్ధుల్లో ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల చికాకులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. మొత్తంమీద ఈ సం||ము అంతా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది అని చెప్పవచ్చు.

ఈ రాశివారు ఆధిత్యుడిని మంకెనపూలతో పూజించి ఈ క్రింది శ్లోకాన్ని ప్రతీ రోజూ తూర్పు ముఖంగా నిలబడి 6 సార్లు పటించినా ఆరోగ్యం చేకూరుతుంది.

ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య:ప్రచోదయాత్||
విష్ణుసహస్రనామం చదవడం లేక వినడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి.

ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును, శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు, ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మిచెట్టును ఖాళీ ప్రదేశాల్లో గాని దేవాలయాల్లో విద్యాసంస్థసల్లోగాని నాటి దాని అభివృద్ధికి ప్రయత్నించిన మీరు అభివృద్ధి చెందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతికెంపు, లేక స్టార్‌రూబి అనే రాయిని, శ్రవణా నక్షత్రం వారు స్పందన ముత్యం, లేక జాతిముత్యాన్ని, ధనిష్ఠ నక్షత్రం వారు జాతి పగడాన్ని ధరించిన సర్వదా శుభం కలుగుతుంది.

కుంభరాశి

ఆదాయం-5 వ్యయం-5 పూజ్యత-6 అవమానం-3

ఈ రాశివారికి మే 10వ తేది వరకు తృతీయము నందు కేతువు, భాగ్యము నందు రాహువు, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు రాహువు. జూన్ 18వ తేది వరకు పంచమము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా షష్ఠమము నందు, నవంబరు 2వ తేది వరకు భాగ్యము నందు శని ఆ తదుపరి అంతా రాజ్యము నందు సంచరిస్తారు.

ఈ గోచారం పరీక్షించగా "కృషిమూలం మిదం ధనం" అన్నట్టుగా మీ కృషికి తగిన గుర్తింపు, రాణింపు ఆర్ధికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. సాంఘిక, రాజకీయ రంగాలపట్ల ఆసక్తిపెరుగుతుంది. ఆరోగ్యములో మెళకువ అవసరం. విద్యార్థులకు విద్యా విషయాలపట్ల ఏకాగ్రత లోపం అధికమవుతుంది. వ్యాపారస్తులకు ఒత్తిడి అధికమవుతుంది. టాక్స్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చతప్పులు పడుట వల్ల అపవాదులు ఎదుర్కొక తప్పదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త వహించండి. వివాహం కానివారు శుభవార్తలు వింటారు.

తొందరపడి సంభాషించడం మంచిది కాదని గమనించండి. స్నేహితుల మధ్య విభేదాలు తలెత్తగలవు. నూతన ఒడంబడికలకు అనుకూలమైన కాలం. సినిమా రంగాలలోని వారికి, కార్మికులకు అశాంతి, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు సంతృప్తి అభివృద్ధి కానరాగలదు. వైద్యులకు చికాకు. ఆడిటర్‌లకు సామాన్యం. ప్లీడర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. వాగ్దానాలు చేసి ఇబ్బందులకు లోనుకాకండి. కుటుంబ వ్యవహారాలు కలహాలకు దారి తీసే అవకాశం ఉంది. నిత్యవసర వస్తు స్టాకిస్టులకు, మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉండగలదు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు.

స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. వాహనం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. మీ రాకను మిత్రులు తప్పుగా అర్ధం చేసుకునే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. విలువైన కానుకలందించి ప్రముఖుల ప్రాపకం సంపాదిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆస్తి పంపకాలు, భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పున:ప్రారంభిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి.

స్త్రీలు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. రేషన్ డీలర్లు, నిత్యవసర వస్తు స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, బేకరి, తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మొత్తం మీద ఈ సం||ము అంతా శుభ, అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ రాశి వారు పంచముఖ ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మనోనిగ్రహ, ఆత్మనిగ్రహం కానవస్తుంది.

ఈ రాశివారికి అష్టమ రాహుదోషం ఏర్పడుచున్నందువల్ల ఈ క్రింది మంత్రాన్ని ప్రతీరోజు 18 సార్లు పటించినా సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది.

ఓం శీర్షరూపాయ విద్మహే సింహకేశాయ ధీమహి తన్నో రాహు:ప్రచోదయాత్||

ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి, శతభిషా నక్షత్రం వారు జమ్మి, శతభిషా నక్షత్రం వారు అరటి, పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లోగాని నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది.

ప్రతీ రోజూ ఈ రాశివారు కనకధారా స్తోత్రాన్ని చదివినా లేక విన్నా ఆర్ధికాభివృద్ధి పురోభివృద్ధి కానవస్తుంది. ధనిష్ట నక్షత్రం వారు జాతి తెల్ల పగడం, శతభిషా నక్షత్రం వారు ఎర్ర గోమేధికం, పూర్వాభాద్ర నక్షత్రం వారు వైక్రాంతమణి లేక కనకపుష్యరాగం అనే రాయిని ధరించినా శుభం కలుగుతుంది.

మీనరాశి

ఆదాయం-2 వ్యయం-11 పూజ్యత-2 అవమానం-6

ఈ రాశి వారికి మే 10వ తేది వరకు ద్వితీయము నందు కేతువు అష్టమము నందు రాహువు ఆ తదుపరి అంతా జన్మము నందు కేతువు, సప్తమము నందు రాహువు. నవంబరు 2వ తేది వరకు అష్టమ శని, ఆ తదుపరి అంతా భాగ్యము నందు శని. జూన్ 18వ తేది వరకు చతుర్థము నందు బృహస్పతి. ఆ తదుపరి అంతా పంచమము నందు సంచరిస్తారు.

ఈ గోచారం పరీక్షించగా "స్వామిత్వం చైవ దాతృత్వం ధనికత్వం తప:ఫలమ్" అన్నట్టుగా అనుకోకుండా ధనం సమకూరుట వల్ల ఆర్ధికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు. అష్టమ శని ప్రభావం అధికంగా ఉన్నందువల్ల ఆహార వ్యవహారాలలో మెళుకువ అవసరం. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్త్రీలకు మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైనది అని గమనించండి. వివాదంలో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. స్పెక్యులేషన్ రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయ రంగాలవారికి మందుల వ్యాపారస్తులు సత్‌ఫలితాలు పొందుతారు. భాగస్వాముల మధ్య ప్రయోజనకరమైన విషయాలు చర్చకు వస్తాయి.

తాపీ పనివారికి, చేతి పనివారికి, కార్మీకులకు, కర్షకులకు అభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిరస్తాయి. రుణం ఏమాత్రం తీర్చలేకపోతారు. చిన్న తరహా పరిశ్రమలలో వారు పనివారి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థులకు విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. మీ కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి వ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. సాంకేతిక రంగాలలోని వారికి పురోభివృద్ధి.

కళలపట్ల, వస్తువులపట్ల, ఆభరణాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారిలో తప్పులను వెదికే ప్రయత్నాలను విరమించండి. పీచు, ఫోమ్ వ్యాపారస్తులకు సత్‌కాలం అనే చెప్పవచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాల్లో వారికి ఆశాజనకంగా ఉంటుంది. రేపటి కార్యక్రమాల గురించి ఈ రోజే ఆలోచించి క్రియారూపంలోపెట్టండి. ఏదైనా స్థిరాస్తులు అమ్మే ప్రయత్నంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. బంగారం, వెండి వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.

విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిత్యవసర వస్తు స్టాకిస్టులకు, కంది, మినుము, ఆవాలు, ధనియాలు, బొబ్బర్లు, జొన్న వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో హామీలు ఉండుట మంచిదికాదని గమనించండి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. రిప్రజెంటివ్‌లకు నిర్దేశించబడిన గమ్యానికి చేరలేకపోవడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మొత్తం మీద ఈ సం||ము అంతా ఒత్తిడి, చికాకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా పురోభివృద్ధి కానవస్తుంది.

ఈ రాశివారు సదాశివుని దేవగన్నేరు పూలతో పూజించడం వల్ల పురోభివృద్ధి కానరాగలదు. అష్ఠమ శని దోషం ఉన్నందువల్ల ఈ రాశివారు ఈ క్రింది శ్లోకాన్ని ప్రతీరోజు 16 సార్లు పటించడంవల్ల కానీ నవగ్రహ ప్రదక్షణ చేస్తూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల కానీ సర్వదా శుభం కలుగుతుంది.

నీలాంజన సమభాసం, రవి పుత్రం యమాగ్రజమ్|
ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం||

పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును, ఉత్తరాభాద్ర వారు వేప చెట్టును, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లో గాని నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడినమీకు అభివృద్ధి కానవస్తుంది.

పూర్వాభాద్ర నక్షత్రం వారు కనుక పుష్యరాగం లేక వైక్రాంతమణి, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, పుష్యనీలం, రేవతి నక్షత్రం వారు, జాతిపచ్చ లేక గరుడపచ్చ అనే రాయిని ధరించినా కలిసిరాగలదు.

వెబ్దునియా పై చదవండి