మంగళవారం పూట.. ఎర్రటి పువ్వులను హనుమంతునికి సమర్పిస్తే?

సోమవారం, 4 జూన్ 2018 (13:13 IST)
మంగళవారం పూట గణేశుడు, దుర్గాదేవి, కాళిమాత, హనుమంతుడిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. దుర్గాదేవికి రాహుకాలంలో నేతి దీపం వెలిగించడం.. హనుమంతుడి పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా నవగ్రహాల్లో కుజుని గ్రహానికి దీపమెలిగించడం ద్వారా రుణబాధల నుంచి విముక్తి పొందవచ్చు.
 
శత్రుబాధ నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే మంగళవారం పూట ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆ రోజు అదృష్టం వరిస్తుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం ఉపవాసం చేసి.. హనుమంతుడు, కార్తీకేయుడు, దుర్గ, కాళి మాతను పూజించడం ద్వారా కుజ దోషాలు తొలగిపోతాయి. ఒంటి పూట భోజనం, ఉప్పు చేర్చిన ఆహారాన్ని తీసుకోకుండా 21 మంగళవారాలు హనుమంతునికి, కార్తీకేయునికి ఉపవాసం చేస్తే సకలసంపదలు చేకూరుతాయి. 
 
అలాగే మంగళవారం పూట ఎర్రటి పువ్వులను హనుమంతునికి సమర్పించుకుంటే.. అష్టకష్టాలు తొలగిపోతాయి. కుజగ్రహ దోషాలు పటాపంచలవుతాయి. మాంసాహారాన్ని పక్కనబెట్టి శాకాహారాన్ని తీసుకుని.. మంగళవారం పూట ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు