భీష్ముడు మాఘ శుక్ల అష్టమి నాడు తనువు చాలించినా వైకుంఠానికి చేరడానికి మూడు రోజులు పడుతుంది. కావున ఏకాదశి నాడు భీష్ముడు మోక్షాన్ని పొందాడని ప్రసిద్ధి. అందుకే మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి అని అంటారు. మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా పిలుస్తారు.
భీష్మ ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు అఖండ విష్ణు సహస్రనామ పారాయణ జరిగితే పరమాత్మ వైకుంఠాన్ని ప్రసాదిస్తారు, మరు జన్మ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి.