కలశంపై వుంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?

గురువారం, 6 మే 2021 (21:50 IST)
కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని.. అది ఒక వేళ కష్టమైతే దగ్గర్లోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ వుంటారు. 
 
కనుక వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం దోషం లేదు. నోములు- వ్రతాల్లో వుంచే రాగి చెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి దానికి పసుపు- కుంకుమలు పెడతారు, ఆ కలశంతో కొంత నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. 
 
కలశంపై మామిడి ఆకులు చుట్టూ వుండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను వుంచుతారు. పూజ అయిన తర్వాత కొబ్బరికాయను నీళ్లల్లో నిమ్మజ్జనం చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు