చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి, దారిద్ర నాశనానికి కొబ్బరి దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే కృష్ణ, శుక్ల పక్ష అష్టమి రోజున కాలభైరవునికి కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. ఏలినాటి శనిగ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది.
వివాహ అడ్డంకులు తొలగిపోవాలన్నా, వ్యాపారాభివృద్ధి చెందాలన్నా.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా కొబ్బరి దీపాన్ని వెలిగించడం చేయాలి. అమ్మవారి సన్నిధానంలో కొబ్బరి దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా చేస్తే.. అదృష్టంతో పాటు సిరిసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.