మంచి శకునాలుగా వీటిని పరిగణించవచ్చు. గుర్రము, అక్షతలు, గంధము, పువ్వులు, ఛత్రము, పల్లకి, ఏనుగు, తేనె, నెయ్యి, పెరుగు, చేప, మాంసం, మద్యము, ఇస్త్రీ బట్టలు, శంఖనాదము, మంగళ వాయిద్యములు, వేద ఘోష, ఏడ్పులేని శవము, పూర్ణకుంభం, వేశ్యలు, అద్దములు, సింహాసనము, కన్య, మంచుతున్న నిప్పు వంటివి శుభ శకునాలే. కార్యసిద్ధి కోసం వెళ్తుంటే.. పిచ్చుక కనిపించడం.. తుమ్మెద, చిలుక, ఒంటె, నెమలి, నక్క వంటివి కనిపించడం మంచిది.