శనివారం రాశిఫలితాలు : మీ గౌరవానికి భంగం....

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (08:34 IST)
మేషం : ఉద్యోగస్తులు సమర్థతను అధికారులు గుర్తిస్తారు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు, స్వీయ అర్జన, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం : బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముంగిచాల్సి ఉంటుంది. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థతకు గురవుతారు. రాజకీయ నేతలు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిథునం : వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలు అధికమిస్తారు. అందరితో సఖ్యతగా మెలుగుతూనే మీ పనులను చక్కబెట్టుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు తప్పవు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. పత్రికా సంస్థలలోని వారి శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. 
 
కర్కాటకం : ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక స్థితికి ఆటంకంగా నిలుస్తాయి. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
సింహం : వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు టీవీ, చానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. విద్యార్థుల ప్రేమ వ్యవహారం పెద్దలకు ఓ సమస్యగా మారుతుంది. మిత్రుల కలయికతో మనసుకుదుటపడుతుంది. భాగస్వామిక సమావేశాలు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
కన్య : రాజీమార్గంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలలో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. అనుకోకుండా పాత బాకీలు వసూలవుతాయి. మొక్కవోని ధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి.
 
తుల : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. బంధువుల రాకవల్ల ఖర్చులు అధికమవుతాయి. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. కొంతమంది మీ నుంచి ధనం సహాయం అర్థించవచ్చు. జాగ్రత్త వహించండి. 
 
ధనస్సు : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ప్రయాసలు అధికమవుతాయి. నూతన రుణాలు కోసం చేసే యత్నాలు వాయిదాపడతాయి. రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. 
 
మకరం : విద్యార్థులు ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన ధనం కొంతముందు వెనుకలగానైనా అందుతాయి. 
 
కుంభం : వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలకు ఆటంకాలు తప్పవు. కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి.
 
మీనం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు