ఈ రోజు మీ దినఫలాలు : అనుకున్న పనులన్నీ సాఫీగానే...

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (08:26 IST)
మేషం: కొంతమంది మిమ్మల్ని ఆర్థికంగా సహాయం అర్థిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది. ఫైనాన్స్, చిట్‌‍ఫండ్ రంగాల వారికి నిగ్రహశక్తి అవసరం. ఐరన్, సిమెంట్, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సాఫీగా పూర్తి చేయగలుగుతారు.
 
వృషభం : ఉద్యోగాల్లో మార్పులకై చేయు యత్నాలు వాయిదా పడతాయి. సిమెంట్, ఐరన్, కలప ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబీకుల మధ్య చిన్న చిన్న విషయాల్లో ఏకీభావం కుదరకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ముఖ్య విషయాల్లో బంధువర్గాల నుంచి విమర్శలు, పట్టింపులు ఎదుర్కుంటారు. 
 
మిథునం : ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేట్ సంస్థల్లో వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. స్త్రీలకు తల, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కోక తప్పదు. 
 
కర్కాటకం: స్త్రీల లక్ష్య సాధనకు ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. మిమ్ములను విమర్శించిన వారే మీ పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడతారు.
 
సింహం: గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులు స్థానచలనానికై చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు ఇతరులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
కన్య: ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ఆశాజనకరం. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుగ్యోగుల ఆశయసిద్ధికి ప్రముఖుల తోడ్పాటు, పెద్దల సహకారం లభిస్తుంది.
 
తుల: ప్రైవేట్ సంస్థలలో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరమని గమనించండి. దైవ కార్యక్రమాల పట్ల, సాంఘిక కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలు వాయిదా పడటం వల్ల ఇబ్బందులు తప్పవు. రచయితలకు, పత్రికా రంగాల్లోవారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు.
 
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయభేదాలు సమసిపోతాయి. ప్రముఖుల కలయిక వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని వ్యవహారాలు నష్టం కలిగిస్తాయి. ఒక కార్యక్రమం మీకు అనుకూలంగా మారుతుంది.
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు వాయిదా పడటం మంచిది. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. దూరప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచితుల వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మకరం: దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో అసహనానికి లోనవుతారు. పాత రుణాలు తీరుస్తారు.
 
కుంభం: ఆర్థిక ఇబ్బంది అంటూ లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాన్ని కొంతమేరకు పూడ్చుకుంటారు.
 
మీనం: విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. బ్యాంకు, కోర్టు వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ధన వ్యయం అధికంగా ఉన్నా ఇబ్బందులుండవు. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు