బుధవారం (21-02-2018) మీ రాశిఫలితాలు : సోదరుల మధ్య కలహాలు...
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (08:31 IST)
మేషం: సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. ఉపాధ్యాయ రంగాల్లో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణాలు చేయవలసివస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. బ్యాంకు పాత రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
మిథునం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణాల కోసం అన్వేషిస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో చికాకులు తప్పవు. పనులు ఎంతకీ పూర్తికాకుండా విసుగు కలిగిస్తాయి. రవాణా విషయంలో ఆచితూచి వ్యవహరించండి.
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో చురుకుదనం కానవచ్చును. మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.
సింహం: అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. ఫైనాన్స్, చిట్స్ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు తప్పవు.
కన్య: కొంతమంది మీ దృష్టి మళ్లించి మోసగించే ఆస్కారం వుంది. స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అవసరాలకు కావలసిన ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్‌ను అధిగమిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
తుల: స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడులు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. కరెన్సీ నోట్ల పరిశీలన, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త అవసరం.
వృశ్చికం: ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకరూపేణా వస్తున్న అవరోధాలను మనోధైర్యంతో ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం.
ధనస్సు: పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి ఆందోళన అధికం. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు పునరావృతమవుతాయి. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
మకరం: సన్నిహితుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు.
కుంభం: ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు.
మీనం: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు సంతృప్తి కానవస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. తలపెట్టిన పనిలో సఫలీకృతులు కాగలరు. దూర ప్రాంతాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.