హైదరాబాద్‌లో భారీ వర్షాలు- సినిమా ఇంటర్వెల్ కన్నా ట్రాఫిక్‌లో ఎక్కువసేపు..? (video)

సెల్వి

బుధవారం, 25 మార్చి 2026 (08:43 IST)
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షంతో నగర రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. మణికొండలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రహదారులు నీటితో నిండిపోయాయి.
 
గచ్చిబౌలి బ్రిడ్జి సహా పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటి నిండిన రోడ్లపై వాహనాలు గంటల పాటు నిల్చున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ వర్షాలు భిన్నంగా ఉంటాయని.. మంచి సంగీతం వింటూ ప్రశాంతంగా డ్రైవ్ చేద్దాం అనుకుని బయలుదేరతాం.. కానీ ఉన్నట్టుండి ఒక సినిమా ఇంటర్వెల్ కన్నా ఎక్కువసేపు సాగే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటామని ఓ యూజర్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. 
 
చుట్టూ హారన్ల హోరు వినిపిస్తుండగా, చినుకుల వర్షం కాస్తా పూర్తిస్థాయి సంగీత కచేరీలా మారుతూ ఉంటుందని ఆ వీడియోతో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.

Hyderabad rains hit different… you step out thinking it’s a peaceful drive with good music, and suddenly you’re stuck in a traffic jam that feels longer than a movie interval, surrounded by a full orchestra of horns playing their own remix while rain keeps upgrading from drizzle… pic.twitter.com/RIuuhB6oEn

— Hyderabad Real Estate (@hyderabadprop) March 24, 2026

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు