02-07-2019 మంగళవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరిని పూజించడం వల్ల.....

మంగళవారం, 2 జులై 2019 (09:11 IST)
మేషం : మీ సంతానానికి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ మాటలకు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. మార్కెట్ రంగాల వారికి ఏజెంట్లు, బ్రోకర్లు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం అని గమనించండి. ధనవ్యయంతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తితో పాటు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో కొత్తకొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వాహనం ఇతరలకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మిథునం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు రాణిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. సన్నిహితుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయ రంగాలవారు అనుభజ్ఞుల సలహాలు పాటించండి శ్రేయస్కరం. 
 
కర్కాటకం : ఓర్పు, పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. గృహ నిర్మాణలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించకపోవచ్చు. 
 
సింహం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు. మీ నిజాయితీ, చిత్తశుద్ధి ప్రముఖులను ఆకట్టుకుంటారు. భూసంబంధిత క్రయ విక్రయాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. 
 
కన్య : కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వదిలేయడం మంచిది. స్త్రీలు, భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. రుణాలు తీరుస్తారు. విద్యార్థులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. 
 
తుల : ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు రుణాలు తీరుస్తారు. మనోధైర్యంతో అడుగుముందుకేయండి. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఫ్లీడర్ల నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటాయి. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు పైఅధికారుల వల్ల ఒత్తిడి, చికాకును ఎదుర్కొంటారు. ముఖ్యులను కలుసుకుంటారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. రైతులకు వాతావరణంలో మార్పు చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు సంతృప్తి కానవస్తుంది. 
 
ధనస్సు : రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు వంటివి తలెత్తుతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానంపై ప్రేమా, వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మకరం : లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కోసం ధన విరిగా వ్యయమవుతుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. నిరుద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పాతమొండిబాకీలు వసూలవుతాయి. 
 
కుంభం : చిన్నచిన్న విషయాలలో మానసిక ఆందోళనకు గురవుతారు. సభలు, సమావేశాలలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనాభివృద్ధి కానవచ్చినా ధనం ఏమాత్రం నిల్వ చేయలేక పోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు.
 
మీనం : కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దుబారా ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు