రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

సెల్వి

గురువారం, 2 ఏప్రియల్ 2026 (11:08 IST)
Tirumala
తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. దాదాపు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు. 
 
ఈ సందర్భంగా తిరుమల కొండల గోవింద నామ స్మరణతో మారుమోగింది. అలాగే హనుమజ్జయంతి రోజున తిరుమల కొండ ప్రకాశించింది. శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ తిరుమల దివ్యక్షేత్రంలో రాత్రి వేళ ఎంత మనోహరంగా వుందో చూపే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆకాశం నుంచి చూస్తే తిరుమల గిరులు ఒక వెలుగుల హారంగా గోచరిస్తోంది. ఈ వీడియోలో తిరుమల కొండల పాదయాత్ర మెట్లు కొండలపై వెలిగే లైట్లు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

Tirumala night Aerial View ????????????????❤️❤️????????

ఆకాశం నుండి చూస్తే తిరుమల గిరులు ఒక వెలుగుల హారంగా కనిపిస్తున్నాయి.

సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం రాత్రి వేళ ఎంత మనోహరంగా ఉందో చూడండి! ????✨ #Tirumala #LordVenkateswara #TirumalaNightView #Govinda #SevenHillspic.twitter.com/pXPbAOAJJ5

— మన ప్రకాశం (@mana_Prakasam) April 1, 2026

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు